అభిమానం హద్దులు దాటుతుంది…అభిమానం వెర్రితలలు వేస్తుంది…అభిమానంతో కొందరు చేస్తున్న పిచ్చి పనులు, వేస్తున్న పిచ్చి వేషాలు చూస్తుంటే సగటు ప్రేక్షకుడికి పిచ్చ కోపం వస్తుంది. అసలు మ్యాటర్ ఏంటి అంటే, ఆ మధ్య పవన్ ఫ్యాన్స్, బన్నీ ఫ్యాన్స్ మధ్య జరిగిన గొడవ గుర్తు ఉందా? పవన్ టీజర్ రాగానే బన్ని అభిమానులు సామాజిక మాధ్యమాల్లో డిస్‌లైక్‌లు కొట్టడం.. బన్ని టీజర్ రాగానే పవన్ అభిమానులు డిజ్‌లైక్స్ కొట్టడం చూస్తూ ఉంటే వీళ్ళు అభిమానులో లేక పిచ్చి వల్లో అర్ధం కాక విమర్శకులు సైతం విమర్శించడానికి పదాలు రాక మౌనం వహించారు. ఇక ఒకానొక మెగా ఫ్యామిలీ వేడుకలో పవన్ ఫ్యాన్స్ కుర్చీలు పగలకొట్టి, పవన్ పవన్ అంటూ నినాదాలు చేసి, నానా హంగామా చేసి పవన్ పరువును రోడ్డుకు ఈడ్చారు అనే చెప్పాలి. అయితే వీటన్నింటికి ఫుల్ స్టాప్ పదే రోజు ఎప్పుడు వస్తుందో తెలీదు కానీ. ఒక్క విషయం మాత్రం నిజం స్పైడర్ టీజర్ విషయంలో మాత్రం అందరి అభిమానులు సంయమనం పాటించారు.
ఆ లోతుల్లోకి వెళితే, లేటెస్టుగా ప్రిన్స్ మహేష్ `స్పైడర్` టీజర్‌కి పవన్ ఫ్యాన్స్ నుంచి చక్కని ప్రశంసలు వస్తూ ఉండడం నిజంగా శుభ పరిణామం. అందులోనూ పీకే వీరాభిమానులు సైతం టీజర్ బావుందంటూ కాంప్లిమెంట్స్ ఇస్తుండడం విశేషం. స్పైడర్ టీజర్ రిలీజైన గంటలోనే 10లక్షల వ్యూస్ .. 50,000 లైక్‌లు సాధించింది. ఇప్పటికే 40 లక్షల వ్యూస్‌ని అధిగమించింది. టీజర్ ఈ స్థాయి విజయం సాధించడానికి కారణం మహేష్ అభిమానులతో పాటు పవన్ అభిమానులు అంతే క్యూరియస్‌గా ఎదురు చూడడం వల్లనే. ఫ్యాన్సే కదా హీరోల బలం. ఇప్పుడు యాంటీ ఫ్యాన్స్ అనుకునేవాళ్లు పాజిటివ్‌గా మారిపోవడంతో అది సినిమాల బాక్సాఫీస్ కలెక్షన్ల వద్ద వర్కవుటవుతోంది. ఇది మంచి పరిణామమే. ఈకా పవన్ మరియు ప్రిన్స్ హీరోలు మాత్రమే కాకుండా మన అందరి హీరోలు కూడా ఇలానే సంయమనం పాటిస్తే, బాహుబాలి లాంటి భారీ బ్లాక్ బస్టర్స్ ఎన్నో తీసి మన తెలుగు చిత్ర ఖ్యాతిని ప్రపంచానికి మరింతగా చాటి చెప్పవచ్చు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.