సూపర్ లుక్ కోసం లైపో సక్షన్ చేసుకున్న టాలీవుడ్ స్టార్స్

  • January 20, 2017 / 11:08 AM IST

సినీ ప్రపంచంలో అభినయంతో పాటు అందానికి అధిక ప్రాధాన్యం ఉంటుంది. అందుకే అందానికి మెరుగులు దిద్దుకొని గ్లామర్ ఫీల్డ్ లో ప్రవేశిస్తారు. వయసు పెరుగుతున్నకొద్దీ నటీనటుల్లో మార్పులు సహజం. అవి కొందరిలో అధికంగా కనిపిస్తాయి. ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కువకాలం కొనసాగాలనే ఉద్దేశంతో, మరింత అందంగా కనిపించాలని శరీరాన్ని కోతలకు గురిచేస్తుంటారు. బాడీలో పేరుకు పోయిన కొవ్వును లైపో సక్షన్ అనే చికిత్స ద్వారా తొలిగించుకొని స్లిమ్ గా తయారవుతుంటారు. అలా టాలీవుడ్ లో బరువు తగ్గడానికి లైపో సెక్షన్ ను ఆశ్రయించిన స్టార్స్ పై ఫోకస్..

చిరంజీవిమెగాస్టార్ చిరంజీవి చిత్రపరిశ్రమలోకి వచ్చిన తర్వాత ఇరవై ఏళ్లపాటు బాడీని బాగా మెయిన్ టైన్ చేశారు. హిట్లర్ సినిమా సమయానికి బాగా లావు అయ్యారు. ఆ తర్వాత వ్యాయామం చేసి కొంచెం తగ్గారు. మృగరాజు చిత్రానికి మళ్ళీ లావు అయ్యారు. దీంతో బరువు తగ్గాలని కసితో లైపో చేయించుకొని ఇంద్ర చిత్రంలో అదిరే లుక్ తో ఆకట్టుకున్నారు.

ఎన్టీఆర్యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టూడెంట్ నంబర్ వన్ చిత్రం నుంచే కొంచెం బొద్దుగా ఉంటారు. ఆయన ఎంచుకొనే కథలకు ఆ లుక్ బాగా సెట్ అయ్యేది. కానీ తాను రాను రాను బరువు పెరిగిపోయారు. రాఖీ చిత్రంలో అయితే షేప్ పూర్తిగా అవుట్ అయిపోయారు. ఇక ఎక్సర్ సైజ్ తో లాభం లేదనుకొని లైపో చేయించుకొని యమదొంగలో అందరినీ ఆశ్చర్యపరిచారు.

నయనతారమొదట్లో బొద్దుగా, ముద్దుగా కనిపించిన నయనతార స్లిమ్ కావడం వెనుక లైపో మంత్రం ఉంది. ఈ చికిత్స తో మంచి వర్కవుట్ చేసుకొని ఫిట్ బాడీ ని సొంతం చేసుకుంది. దక్షిణాది సినీ పరిశ్రమల్లో టాప్ హీరోయిన్స్ జాబితాలో స్థానం దక్కించుకుంది.

మంచు విష్ణుడైలాగ్ కింగ్ మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు సినిమాల్లోకి బలంగానే ఎంట్రీ ఇచ్చాడు. నేటి తరం ఆడియన్స్ ని ఆకట్టుకోవాలంటే బరువు తగ్గాలని ఆలస్యంగా తెలుసుకొని సలీం చిత్రానికి ముందు లైపో చేయించుకొని సూపర్ లుక్ ని సాధించాడు.

రాశిభారీ అందాల సుందరి రాశి. బరువుగా ఉన్నప్పటికీ అద్భుతంగా డ్యాన్స్ లు చేసి అలరించింది. పెళ్లి చేసుకొని సినిమా పరిశ్రమకు దూరం కావడంతో బరువు బాగా పెరిగారు. సొంత పనులు చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడ్డారు. చివరికి లైపో ని ఆశ్రయించి బరువు తగ్గించుకున్నారు. టీవీ షో చేశారు. త్వరలో కొత్త లుక్ తో వెండి తెరపై మెరవనున్నారు.

హరికృష్ణటాలీవుడ్ సీతయ్య నందమూరి హరికృష్ణ కూడా బరువు తగ్గేందుకు లైపో చేయించుకున్నారు. సినిమాల్లో అవకాశాల కోసం కాకుండా అధిక బరువుతో గుండె జబ్బులు రాకుండా, ఎక్కువకాలం ఆరోగ్యంగా ఉండాలని ఈ చికిత్సను చేసుకున్నారు. పూర్తిగా పూర్వపు లుక్ ని మార్చుకున్నారు.

సునీల్హాస్యనటుడు సునీల్ తన బాడీపై కూడా జోకులు వేసుకొని నవ్వించారు. హీరోగా మారిన తర్వాత సిక్స్ ప్యాక్ తెచ్చుకొని ఔరా అనిపించారు. ఈయన మార్పు వెనుక లైపో సహకారం కూడా ఉంది. పూలరంగడు చిత్ర సమయంలో లైపో చేయించుకొని కసరత్తు చేసి విజయం దక్కించుకున్నారు.

దివ్యవాణినట కిరీటి రాజేంద్ర ప్రసాద్ తో కలిసి దివ్యవాణి అనేక హిట్స్ అందుకుంది. తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళంలో అనేక చిత్రాల్లో అందం, అభినయంతో ఆకట్టుకుంది. పెళ్లి అయిన తర్వాత డైట్ కంట్రోల్ తప్పింది. దీంతో బరువు పెరిగింది. ఇప్పుడు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని లైపో చేయించుకొని పూర్వపు లుక్ తెచ్చుకుంటోంది.

శ్రీహరిరియల్ స్టార్ శ్రీహరి కండల రాయుడు. విలన్ పాత్రల నుంచి హీరోగా మారి క్యారక్టర్ ఆర్టిస్టుగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇలా కెరీర్ లో పాత్రలను మార్చుకుంటున్న తరుణంలో బాడీ ని మార్చుకునేందుకు లైపో చేసుకున్నారు. కానీ ఆ ఆనందం ఆయనకు ఎక్కువకాలం నిలువలేదు లివర్ క్యాన్సర్ తో మరణించారు.

ఆర్తి అగర్వాల్ఆర్తి అగర్వాల్ బొద్దుగా ఉన్నప్పటికీ అందరూ ఆదరించారు. అనేక హిట్లు అందించారు. టాలీవుడ్ లోకి సైజ్ జీరో బ్యూటీలు రావడంతో వారికి పోటీ ఇవ్వాలంటే సన్నగా ఉండాలని అమెరికాలో లైపో చేయించుకుంది. కానీ ఈ ఆపరేషన్ వల్ల ఆమెకు శ్వాస సంబంధ సమస్యలు తలెత్తి హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోయింది. సినిమాల్లో నటన కొనసాగించాలనే తపన ఆమె ప్రాణం తీసింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus