Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Advertisement

పాన్ ఇండియా హిట్టు కొట్టాలన్న ఆశ.. మన టాలీవుడ్(Tollywood) హీరోలకు అప్పుడప్పుడు లేనిపోని తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఆ పాన్ ఇండియా అప్పీల్ కోసమే కొత్తగా ట్రై చేద్దామని బాడీలు పెంచి, గెటప్పులు మారుస్తున్నారు.

Tollywood

కానీ తీరా ప్రొడక్షన్ లేట్ అయితే.. ఆ గెటప్ నుంచి బయటకు రాలేక హీరోలు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ప్రస్తుతం మన టాలీవుడ్‌లో ఓ యంగ్ హీరో పరిస్థితి అచ్చం ఇలాగే ఉందంటూ ఫిల్మ్ నగర్‌లో గాసిప్స్ వినిపిస్తున్నాయి.

ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి లవర్ బాయ్ ఇమేజ్‌తో, క్లాస్ సినిమాలతో దూసుకుపోయిన ఆ మీడియం రేంజ్ హీరో.. సడెన్‌గా రూట్ మార్చాడు. ఓ భారీ పీరియాడిక్ అడ్వెంచర్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అందుకోసం జిమ్‌లో కష్టపడి కండలు పెంచి, ఓ రేంజ్ రగ్గడ్ లుక్‌లోకి మారిపోయాడు. సినిమా దాదాపు చాలా వరకు కంప్లీట్ అయ్యింది. కానీ క్లైమాక్స్‌లో భారీ (వీఎఫ్ఎక్స్) ఎపిసోడ్స్ ఉండటంతో బడ్జెట్ అమాంతం వంద కోట్లు దాటేసిందట.

దీంతో లెక్కలు తేలక షూటింగ్‌కు మాటిమాటికీ బ్రేకులు పడుతున్నట్లు ఇన్‌సైడ్ టాక్. పోనీ ఈ గ్యాప్‌లో వేరే సినిమా అయినా స్టార్ట్ చేద్దాం అంటే.. ఆ హీరోకి ఈ బల్కీ లుక్  అడ్డం పడుతోంది. ఈ బాడీ లాంగ్వేజ్‌కి వేరే క్లాస్ కథలు సెట్ కావు, అలాగని బరువు తగ్గి పాత లుక్‌లోకి వస్తే.. ఆగిపోయిన సినిమా బ్యాలెన్స్ షూట్ చేయలేడు.

దీంతో పాపం ఆ హీరో అటు కొత్త ప్రాజెక్ట్ పట్టాలెక్కించలేక, ఇటు ఈ సినిమా ఎప్పుడు పూర్తవుతుందో తెలియక దారుణంగా లాక్ అయిపోయాడు. ఈ ఏడాదే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా బడ్జెట్ కష్టాలు ఎప్పుడు తీరుతాయో.. ఆ హీరోకి ఈ బాడీ బిల్డింగ్ టెన్షన్ నుంచి ఎప్పుడు ఫ్రీడమ్ దొరుకుతుందో చూడాలి. ఇంతకీ ఆ లవర్ బాయ్ టర్న్డ్ మాస్ హీరో ఎవరో ఈపాటికే మీకు స్ట్రైక్ అయ్యుంటుంది కదా.

బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read