‘త్రివిక్రమ్”కు నో చెప్పిన తెలుగు హీరో!!!

  • May 21, 2016 / 10:44 AM IST

టాలీవుడ్ టాప్ హీరోలకు ఎంత క్రేజ్ ఉందో… అంతే రేంజ్ క్రేజ్ కొందరు దర్శకులకు కూడా ఉంది. అయితే అలాంటి దర్శకుల్లో ఒకరైన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు పెద్ద షాక్ తగిలిందంటా…ఇప్పటివరకూ త్రివిక్రమ్ ఊహించని విధంగా ఒక హీరో త్రివిక్రమ్ కి నో చెప్పాడని ఇండస్ట్రీ లో టాక్. ఇంతకీ విషయం ఏమిటంటే…ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోలందరూ త్రివిక్రమ్ తో ఒక్క సినిమా చేస్తే చాలు అని అనుకునే వారు. సడన్ గా ఏమయ్యిందో ఏమో కానీ, త్రివిక్రమ్ క్రేజ్ అమాంతంగా తగ్గింది. టాప్ హీరోలంతా ఇప్పుడు కొత్త హీరోల బాట పడుతూ ఉన్నారు. ఇదిలా ఉంటే నితిన్, సమంత కాంబినేషన్ లో వస్తున్న అ..ఆ మూవీ తరువాత త్రివిక్రమ్ మరో చిన్న మూవీకి ప్లానింగ్ చేస్తున్నాడంట.

ఆ మూవీకి త్రివిక్రమ్ నిర్మాతగా ఉండే ఛాన్స్ ఉందని అంటున్నారు. దీంతో ప్రస్తుతం చిన్నహీరోలలో ఫాంలో ఉన్న ఇద్దరు హీరోల వద్దకి త్రివిక్రమ్ కథని తీసుకొని వెళ్ళి చెప్పగా…అక్కడ త్రివిక్రమ్ కు అనుకోని షాక్ తగిలింది అని తెలుస్తుంది…ఒక యంగ్ హీరోకి స్టోరీ లైన్ చెప్పిన వెంటనే ఆ సినిమాని తను చేయనని చెప్పటంతో త్రివిక్రమ్ సైతం షాక్ అయ్యాడంట. ఎందుకంటే ఇప్పుడే ఎదుగుతున్న ఆ హీరోకి, త్రివిక్రమ్ మూవీలో చేస్తే…తనకి పేరు రాకుండా త్రివిక్రమ్ కి వస్తుందని…అందుకే త్రివిక్రమ్ మూవీని రిజెక్ట్ చేశానని ఆ కుర్ర హీరో స్వయంగా చెబుతున్నాడు. ఒక రకంగా నిజమే అయినా….అది మన దర్శకుడి టాలెంట్, దాన్ని మనం ఎలా తప్పుబట్టగలం. ఏది ఏమైనా…త్రివిక్రమ్ కు కాస్త బ్యాడ్ టైమ్ నడుస్తుంది అనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus