పెళ్లికొడుకుల జాబితాలో యువ హీరోలు

  • November 12, 2016 / 09:43 AM IST

టాలీవుడ్ లో పెళ్లిళ్ల కోలాహలం మొదలయింది. వచ్చే ఏడాది అక్కినేని ప్రిన్స్ అఖిల్ పెళ్లి జరుగుతుందని ఖరారు కాగా.. మరో కొంతమంది యువ హీరోలు పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమవుతున్నారు. ఆ జాబితాలో మొదటి వ్యక్తిగా యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య ఉన్నారు. సమంత తో పెళ్లి చేసుకోవడానికి మంచి రోజు కోసం ఎదురుచూస్తున్నారు. ఆ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పేరు వినిపిస్తోంది. బాహుబలి కంక్లూజన్ పూర్తి చేసిన వెంటనే ఓ ఇంటి వాడిని చేయడానికి బాబాయ్ కృష్ణం రాజు రెడీగా ఉన్నారు.

తాజాగా ఈ లిస్ట్ లో శర్వానంద్, నితిన్ చేరారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ భార్య ఉపాసన కజిన్ ని శర్వానంద్ ప్రేమిస్తున్నారని, ఆమెనే పెళ్లిచేసుకునేలా సంప్రదింపులు జరుగుతున్నట్లు సమాచారం. ఈ వార్తలపై శర్వానంద్ స్పందించడానికి సుముఖుత చూపించడంలేదు. అఖిల్ కాబోయే భార్య శ్రీయ భూపాల్ బంధువుల అమ్మాయిని నితిన్ పెళ్లిచేసుకోనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ విషయాన్నీ నితిన్ తల్లిదండ్రుల ముందు ఉంచగా.. ఈ వార్తలను వారు ఖండించారు. అయితే తాము నితిన్ కి సరిజోడి కోసం వెతికే పనిలో ఉన్నట్లు స్పష్టంచేశారు. సో వచ్చే ఏడాది అనేకమంది తెలుగు హీరోలు తమ బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పనున్నారన్నమాట.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus