మీటూ అంటూ హడావుడి చేస్తున్న హీరోయిన్ల జాతకాలు నాకు తెలుసు

“మీ టూ” ప్రస్తుతం ఈ హ్యాష్ ట్యాగ్ గురించి తెలియనివారుండరు అంటే అతిశయోక్తి కాదేమో. ఆ హ్యాష్ ట్యాగ్ చేసిన రచ్చ అలాంటిది. అయితే.. సదరు హ్యాష్ ట్యాగ్ ద్వారా చేస్తున్న ఆరోపణల్లో సగానికిపైగా ఫేక్ ఉంటున్నాయని విశ్లేషణలు వ్యక్తమవుతున్నప్పటికీ.. సదరు కంప్లైంట్స్ మాత్రం తగ్గడం లేదు. అయితే.. ఇటీవల ఓ యువ కథానాయకి ఈ మీటూ హ్యాష్ ట్యాగ్ తో హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు మీద కొందరు హీరోయిన్లు చేస్తున్న కామెంట్స్ & హడావుడి గురించి కాస్త ఘాటుగా స్పందించింది. సరిగ్గా ఓ పది సినిమాలు చేసిన అనుభవం కూడా లేని సదరు యువ కథానాయిక చేసిన కామెంట్స్ వింటే సదరు హీరోయిన్లందరూ నోళ్ళు మూసుకోవాల్సిందే.

ఇంతకీ అమ్మడు చేసిన కామెంట్స్ ఏమిటంటే.. “ఇప్పుడు “మీ టూ” అంటూ తెగ హడావుడి చేస్తున్న హీరోయిన్లందరూ ఒకప్పుడు అదే హీరోలు, దర్శకనిర్మాతలు దగ్గర అవకాశాల కోసం పడుకొన్నారు. ఆ వీడియోలను కొందరు ప్రయివేట్ వ్యక్తులకు చూపిస్తూ.. “ఈ వీడియోలు గనుక బయటకొస్తే వాళ్ళ జాతకాలు బట్టబయలు అవుతాయి, ఇప్పుడు వాళ్ళ భవిష్యత్ నా మొబైల్ లో ఉంది” అని కామెంట్ చేయడం నాకు తెలుసు, ఈ హీరోయిన్లీ గనుక ఇలా హడావుడి చేయడం మానకపోతే అర్జెంట్ గా వాళ్ళు చేసిన వెధవ పనులు బయటపెడతాను” అంటూ ఒక గట్టి హెచ్చరిక జారీ చేసింది. హెచ్చరిక జారీ చేసిన కథానాయిక ఎవరు అనేది పక్కన పెడితే.. ఇంతకీ ఆ హడావుడి చేస్తున్న హీరోయిన్లు ఎవరు అనేది మాత్రం చర్చనీయాంశం అయ్యింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus