Tortoise: రాజ్ తరుణ్ కు ‘టార్టాయిస్’ మూవీ టీమ్ స్పెషల్ బర్త్ డే విషెస్

Advertisement

జయాపజయాలతో సంబంధం లేకుండా విభిన్న కథాంశంతో కూడిన సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు రాజ్ తరుణ్. అతను హీరోగా తెరకెక్కుతోన్న అప్ కమింగ్ మూవీస్లో ‘టార్టాయిస్'(Tortoise) ఒకటి.

Tortoise

‘ఎస్ కె గోల్డెన్ ఆర్ట్స్’ ‘ప్రశ్విత ఎంటర్టైన్మెంట్’ ‘ఎన్ వి ఎల్ క్రియేషన్స్’ ‘మధుపాల మహా మూవీస్’ సంస్థలపై విజయ్ చౌదరి, శశిధర్ నల్ల, రామిశెట్టి రాంబాబు మరియు మధుపాల సురేష్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు.

రాజ్ తరుణ్ కి జోడీగా అమృత చౌదరి నటిస్తుండగా శ్రీనివాస్ అవసరాల, ధన్య బాలకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాజ్ తరుణ్ పుట్టినరోజు సందర్బంగా ‘టార్టాయిస్’ టీం స్పెషల్ గా బర్త్ డే విషెస్ చెబుతూ ఓ పోస్టర్ ను వదిలింది.

ఈ సినిమాలో హీరో కి నిద్రలో లేచి నడిచే అలవాటు ఉంటుందట, ఆ అలవాటులో భాగంగా అతను కొన్ని మర్డర్స్ చేస్తాడని తెలుస్తోంది.దీని వల్ల అతని కెరీర్ ఎలాంటి టర్న్ తీసుకుంది అనే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందుతున్నట్టు స్పష్టమవుతుంది. రాజ్ తరుణ్ కెరీర్లో స్పెషల్ మూవీగా ‘టార్టాయిస్’ నిలుస్తుంది అని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆల్రెడీ షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు నిర్వహిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus