Toxic Teaser: టాక్సిక్ టీజర్ రివ్యూ.. ఈ రేంజ్ వయోలెన్సా?

కె.జి.ఎఫ్ తో యష్ కి పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది. కె.జి.ఎఫ్ 2 తో ఆ ఇమేజ్ ఇంకా పెరిగింది. దీంతో యష్ పై ఆడియన్స్ లో అంచనాలు కూడా పెరిగాయి. అందుకే గ్యాప్ తీసుకుని టాక్సిక్ అనే సినిమా చేశాడు. దీని కోసం 4 ఏళ్లు కష్టపడ్డాడు.ఇది కూడా పాన్ ఇండియా సినిమానే. భారీ బడ్జెట్ తో రూపొందింది. తమిళంలో బడా నిర్మాణ సంస్థ అయినటువంటి కే.వి.ఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది.

Toxic Teaser

గీతూ మోహన్ దాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుంది. మార్చి 19న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.ఈరోజు టీజర్ ను వదిలారు. టాక్సిక్ టీజర్ విషయానికి వస్తే.. ఇది 1:56 నిమిషాల నిడివి కలిగి ఉంది.ఈసారి యుద్ధం వేరు, వాళ్ళ కుతంత్రాలు వేరు, అందరితో విరోధం పెట్టుకుని బ్రతకలేం పట్టుదల వదిలేయ్ గివ్ అప్ రాయ అనే డైలాగ్ తో టీజర్ మొదలైంది.

టీజర్ మొత్తం భారీ యాక్షన్ సీక్వెన్స్ లు , బోల్డ్ సన్నివేశాలు, విపరీతమైన వయోలెన్స్ తో నిండి ఉంది. హీరో యష్ ఈ సినిమాలో కి.జి.ఎఫ్ లో కంటే బోల్డ్ గా కొంచెం క్రుయల్ గా కనిపిస్తున్నాడు. ఫ**కిం**గ్ మేనర్స్ వంటి బూతు డైలాగులు కూడా పలికాడు. మొత్తంగా గ్లింప్స్ కంటే కూడా టీజర్ ఇంకా బోల్డ్ గా ఉందని చెప్పాలి. కథ , కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఏంటి వంటి వాటి పై అయితే ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. టీజర్ ను మీరు కూడా ఒక లుక్కేయండి..

 

 నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus