అందాల తార త్రిష తెలుగు టాప్ హీరోలందరితోను నటించి విజయాలను సొంతం చేసింది. అందం, అభినయం తో బాలీవుడ్ లోను సత్తా చాటింది. మాతృభాష తమిళంలోను బిగ్ హిట్ లను అందుకుంది. ఈ సారి నాయకి చిత్రంతో తెలుగు, తమిళం భాషల్లో కలెక్షన్ల సునామీ సృష్టించడానికి సిద్ధమైంది. హారర్ కథతో త్రిష నటించిన తొలి చిత్రం ఇది. ఇందులో టైటిల్ రోల్ పోషిస్తోంది.
సోయగాలతో మతిపోగోట్టే ఈ భామ భయపెట్టేందుకు రానుంది అని తెలిసినప్పటి నుంచి ఈ చిత్రం పై అంచనాలు ఏర్పడ్డాయి. పట్టుచీర కట్టుకుని రక్తం కారుతున్న కత్తితో నడిచి వస్తున్న త్రిష పోస్టర్ నాయకి అంచనాలను అమాంతం పెంచింది. ఈ సినిమా ఆడియోను నట సింహా బాలకృష్ణ రిలీజ్ చేయడంతో నాయకి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారింది. ఈ చిత్రం ఈ నెల 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
నాయకిని చూసిన సెన్సార్ సభ్యులు “ఏ” సర్టిఫికెట్ ఇచ్చారు. ఇందులో భయపెట్టే అంశాలతో పాటు త్రిష చాలా హాట్ గా కనిపించినందుకే “ఏ” గ్రేడ్ ఇచ్చినట్లు తెలిసింది. ఇందులో త్రిష బాగా రెచ్చిపోయి నటించినట్లు సమాచారం. అయితే నాయకి గ్లామర్ తో కూడిన హారర్ ని ఇవ్వనున్నదన్నమాట.