టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అందరినీ మోసం చేశాడా?? అసలు త్రివిక్రమ్ చేసిన మోసం ఏమిటి?? అసలు ఏం జరిగింది అని తెలియాలంటే మాత్రం ఈ స్టోరీ చదవాల్సిందే…వివరాల్లోకి వెళితే…త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తాజాగా నితిన్, సమంతా కలసి నటించిన చిత్రం “అ..ఆ”.
ఈ సినిమా తొలి ఆట నుంచి సూపర్ హిట్ టాక్ ను సంపాదించుకుంది. అయితే ఆ క్రెడిట్ అంతా అందరూ త్రివిక్రమ్ దే అనుకున్నారు…కానీ అసలు కధ వేరు…ఇదంతా మన మాటల మాంత్రికుడి గేమ్ ప్లాన్ అని ఇండస్ట్రీ లో టాక్స్ వినిపిస్తునాయి. ఎందుకంటే ఈ సినిమా ఓ నవలకి సంబంధించిన కథ అని, అలాగే ఓ మూవీకి రిమేక్ అని త్రివిక్రమ్ ఎవ్వరికీ చెప్పకుండా మ్యానేజ్ చేసేసాడు. దానికి గల కారణం కూడా ఇలా చెబితే మూవీపై హైప్ తగ్గిపోతుందని త్రివిక్రమ్ ఆలోచించినట్లు సమాచారం. అయితే ఇక్కడ మొరొక వాదన సైతం ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తున్నాయి.
అవేమిటంటే…త్రివిక్రమ్ లాంటి బడా డైరెక్టర్ ఇలా చేస్తే, ఇక చిన్న డైరెక్టర్స్ రెచ్చిపోరూ అంటూ అందరూ చెవులు కొరుక్కుంటున్నారు… ఇక ఈ సినిమా నవలా రచయిత్రి యద్దనపూడి సులోచనా రాణి ఆలోచనలో నుంచి పుట్టిన ఆలోచన కావడం ఒక ఎత్తు అయితే…గతంలో వచ్చిన ‘మీనా’ సినిమాను ఉన్నది ఉనట్లు తీసినట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా…మొత్తానికి త్రివిక్రమ్ సైతం పాత సినిమా కథని మళ్ళీ కొత్తగా చూపించి సక్సెస్ కొట్టాడు, ఇందుకు అసలు విషయాన్ని దాచి పెట్టి భలే మోసం అని టాలీవుడ్ సర్కిల్స్ చెప్పుకుంటున్నాయి…