ఎన్టీఆర్ సినిమాపై వస్తున్న వార్తలను ఖండించిన త్రివిక్రమ్!

  • November 7, 2017 / 02:37 PM IST

ఒక సారి చేసిన చిన్న పొరబాటు… జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. స్టార్ డైరక్టర్ త్రివికమ్ శ్రీనివాస్  ని కూడా ఓ తప్పిదం వెంబడిస్తూనే ఉంది. నితిన్, సమంత జంటగా తాను తెరకెక్కించిన అ..ఆ మూవీ కథ మీనా నవల ఆధారంగా తెరకెక్కించిందని చెప్పకుండా రిలీజ్ చేయడంతో మాటల మాంత్రికుడు విమర్శలను ఎదుర్కోక తప్పలేదు. ఇప్పుడు కూడా అటువంటి అనుభవమే ఎదురైంది. జై లవకుశ సినిమా తర్వాత త్రివిక్రమ్  దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా చేస్తున్నారు. లాంఛనంగా ప్రారంభమైన ఈ మూవీ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ఈ సినిమా కథను  80ల నాటి నవల ఆధారంగా త్రివిక్రమ్‌ సిద్ధం చేసుకున్నారని , ఇందులో ఎన్టీఆర్ డిటెక్టివ్ రోల్ పోషిస్తున్నారని ఫిలిం నగర్లో గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి.

దీనిపై త్రివిక్రమ్ స్పందించారు. ఆ వార్తలు నిజం కావని, ఎన్టీఆర్ సినిమా కథ ఏ నవల ఆధారంగా రాసుకోలేదని కొంతమంది మీడియా వ్యక్తులకు డైరక్టర్ చెప్పిన్నట్లు తెలిసింది.  అంతేకాదు ఈ సినిమా నువ్వు నాకు నచ్చావ్‌ తరహాలో ఫుల్ కామెడీ గా ఉంటుందని టాక్. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంతోషపడ్డారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ మూవీ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus