ప్రముఖ నిర్మాతకు నో చెప్పిన త్రివిక్రమ్ శ్రీనివాస్

  • October 1, 2018 / 07:23 AM IST

డైరక్టర్, హీరోలకి ముందు స్టార్ అని పేరు వచ్చేసిందంటే.. వారితో సినిమాలు తీయడానికి నిర్మాతలు క్యూ కడుతారు. కొత్త నిర్మాతలే కాదు.. అనుభవం ఉన్న నిర్మాతలు సైతం డేట్స్ కోసం తిరుగుతుంటారు. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా నిర్మించాలనేది చాలామంది కల. అందుకే హీరో ఎవరైనా ఫరవాలేదు.. ఎంత బడ్జెట్ అయినా ఇబ్బంది లేదని కొంతమంది నిర్మాతలు అడ్వాన్స్ లు ఇస్తుంటారు. సరే అని త్రివిక్రమ్ కూడా తీసుకున్నారు. అలా త్రివిక్రమ్ కి అడ్వాన్స్ ఇచ్చిన వారిలో డీవీవీ దానయ్య కూడా ఉన్నటు తెలిసింది. అయితే అతనితో సినిమా చేయడం లేదని తెలిసాక ఆ విషయం బయటపడింది.

దానయ్యకి రీసెంట్ గా త్రివిక్రమ్ అడ్వాన్స్ తిరిగి ఇచ్చేశారని ఫిలిం నగర్ టాక్. కారణం ఏంటో తెలియదు గానే దానయ్య కల మాత్రం నెరవేరడం లేదని అర్ధమయిపోయింది. ప్రస్తుతం దానయ్య బోయపాటితో సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత రాజమౌళి తో మల్టీస్టారర్ మూవీ చేయబోతున్నారు. ఇక త్రివిక్రమ్ విషయానికి వస్తే… మిత్రుడు రాధాకృష్ణ నిర్మాణంలో అరవింద సమేత వీర రాఘవ సినిమా చేస్తున్నారు. దీని తర్వాత వెంకటేష్, అల్లు అర్జున్ తో మల్టీస్టారర్ మూవీ చేయబోతున్నారు. దీనిని ఎవరు నిర్మిస్తారనేది త్వరలోనే తెలియనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus