మెయిన్ గేమ్ కంటే ముందు టెస్ట్ గేమ్ ఆడుతున్నారు.!

Ad not loaded.

మన క్రికెటర్లు ఏవైనా టోర్నమెంట్లకు వెళ్లినప్పుడు వాళ్ళతో మ్యాచ్ ఆడడానికి ముందు సదరు ఆపోజిట్ క్రికెట్ టీం లేదా సొంత టీం మెంబర్స్ తోనే టెస్ట్ మ్యాచ్ ఆడుతుంటారు. పిచ్, వాతావరణం గురించి అవగాహన పెంచుకోవడం కోసం అలా టెస్ట్ మ్యాచ్ లు ఆడుతుంటారు. ఇప్పుడు అదే తరహాలో ఎన్టీఆర్త్రివిక్రమ్ లు కూడా టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నారు. అదేంటంటారా.. అదేనండీ ఎన్టీఆర్ ప్రస్తుతం ఐపీయల్ తెలుగు వెర్షన్ కి ప్రోమోలు షూట్ చేస్తున్న విషయం తెలుసు కదా. ఆ ప్రోమోస్ ను డైరెక్ట్ చేస్తున్నది మరెవరో కాదు స్వయాన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. ఇదివరకు కూడా ఎన్టీఆర్ నటించిన కొన్ని యాడ్ ఫిలిమ్స్ కి త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు.

అయితే.. ఎన్టీఆర్ 28వ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభమవ్వనుండడం, ఎన్టీఆర్ ఆల్రెడీ ఈ సినిమా కోసం లీన్ లుక్ తో రెడీగా ఉండడం .. అదే సందర్భంలో ఈ ప్రోమో షూట్ జరగడం ప్రస్తుతం ప్రత్యేకతను సంతరించుకొంది. ఈ ప్రోమోస్ అవుట్ పుట్ నెక్స్ట్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో రాబోయే సినిమాకి ట్రైలర్ లా ఉండబోతోందన్నది మాత్రం పచ్చినిజం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus