Trivikram – Suriya: సూర్యతో సినిమా… ఒకసారి మిస్‌ అయ్యా.. త్రివిక్రమ్‌ కామెంట్స్‌ వైరల్‌

సూర్యతో సినిమా చేయాలని అనుకున్నాం.. కానీ వివిధ కారణాల వల్ల చేయలేకపోయాం – ఈ మాట ఇప్పుడు మరో డైరక్టర్‌ కూడా చెప్పారు. గతంలో చెప్పిన దర్శకుడి గురించి తర్వాత చూద్దాం. ఇప్పుడు రీసెంట్‌గా చెప్పిన దర్శకుడు గురించి చూద్దాం. ఇద్దరూ పెద్ద దర్శకులేనా? అనే డౌట్‌ వద్దు. ఎందుకంటే పెద్ద దర్శకుడు అయితేనే ఈ పాయింట్‌ చర్చకు వస్తుంది కాబట్టి. ఇక అసలు మేటర్‌కి వెళ్తే.. ఇటీవల జరిగిన ‘విశ్వనాథ్‌ అండ సన్స్‌’ సినిమా సక్సెస్‌ మీట్‌లో ఈ టాపిక్‌ చర్చకు వచ్చింది.

Trivikram – Suriya

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ సూర్య గురించి గొప్పగా చెప్పారు. అలాగే తాను గతంలో సూర్యకు ఓ కథ చెప్పానని, కానీ సినిమాగా మలచలేకపోయాను అని చెప్పారు. అంతేకాదు తాను కథ చెప్పడానికి వెనుక ఉన్న కారణం కూడా చెప్పుకొచ్చారు. ఆ కారణం ఎవరో కాదు త్రివిక్రమ్‌ సతీమణి సాయి సౌజన్య. సూర్య అంటే ఆమెకు చాలా అభిమానమట. అందుకే సూర్యతో సినిమా తీయండి అని తరచూ త్రివిక్రమ్‌కి చెప్పేవారట.

సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌ అంటే అందులోనూ సాయి సౌజన్యకు చెందిన ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ కూడా ఉంటుంది. అయితే ఆమె ఎప్పుడూ సెట్స్‌కి వెళ్లేవారు కాదట. సూర్యతో సినిమా అనేసరికి ఆమె తరచూ వెళ్లి సినిమా గురించి వాకబు చేసేవారట. అంతలా ఇష్టపడే హీరోను తన భర్త డైరెక్ట్‌ చేయాలని కోరుకోవడం తప్పేం కాదు కదా. గతంలో సూర్యకు త్రివిక్రమ్‌ కథ చెప్పినా అవి వర్కౌట్‌ కాలేదు. ఇప్పుడు మరోసారి ప్రయత్నిస్తారేమో చూడాలి.

ఇక ఇదే మాట అన్న ఇంకో స్టార్‌ దర్శకుడు ఎవరనేగా మీ మాట. ఇంకెవరూ జక్కన ఎస్‌.ఎస్‌.రాజమౌళి. ‘మగధీర’ సినిమాకు ముందు సూర్యతో ఆయన ఓ సినిమా చేయాల్సింది. కానీ అప్పుడు వీలుపడలేదు.

 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus