స్నేహితుడికి మంచి రోల్ ఇచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్

Advertisement

అవకాశాలకోసం ప్రయత్నిస్తున్న రోజుల నుంచి సునీల్, త్రివిక్రమ్ బెస్ట్ ఫ్రెండ్స్. హీరోగా, స్టార్ డైరక్టర్ గా ఎదిగినప్పటికీ వీరి మధ్య స్నేహం చెక్కు చెదరలేదు. అయితే హీరోగా విజయాలు లేక ఇబ్బంది పడుతున్న వేళ సునీల్ కి తాను దర్శకత్వం వహిస్తున్న అరవింద సమేత వీర రాఘవ సినిమాలో మంచి రోల్ ఇచ్చారు. ఆ రోల్ పై ఇప్పటివరకు అనేక గాసిప్స్ వచ్చాయి. తాజాగా అతను చేసే రోల్ బయటికి వచ్చింది. సునీల్.. ఎన్టీఆర్ కి గురువుగారుగా కనిపించనున్నారని తెలిసింది. అంటే సీరియస్ గా పాఠాలు చెప్పే గురువుగారు కాదు.. తారక్ అతన్ని అలా పిలుస్తుంటారని సమాచారం. ఎందుకు అలా పిలుస్తారో.. తెలియదు కానీ.. ఈ విషయం మాత్రం ఎన్టీఆర్ అభిమానులను చాలా సంతోషం కలిగిస్తోంది. అదుర్స్ సినిమాలో బ్రహ్మానందంని గురువు గారు అంటూ ఎన్టీఆర్ పిలుస్తూ అద్భుతమైన కామెడీ పండించారు.

మళ్లీ ఇప్పుడు అలాంటి కాంబినేషన్ ను త్రివిక్రమ్ శ్రీనివాస్ సెట్ చేశారని ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు. ఎన్టీఆర్ తో సునీల్ సినిమా మొదలు నుంచి చివరి వరకు కనిపిస్తారంట. ఆఖరికి ఓ డ్యూయట్ లో కూడా కనిపిస్తారని టాక్. వీరి మధ్య ఉండే సన్నివేశాలు బాగా నవ్విస్తాయని ఫిలిం నగర్ వాసులు చెప్పారు. ఈ సినిమాతో సునీల్ పూర్వవైభవాన్ని సొంతంచేసుకుంటారని భావిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో రాధా కృష్ణ నిర్మిస్తున్న ఈ మూవీ అక్టోబర్ 11 న రిలీజ్ కానుంది. పూజా హెగ్డే, ఈషా రెబ్బా హీరోయిన్స్ గా నటిస్తున్నఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus