మాటల మాంత్రికుడు డైరెక్షన్లో ‘వెంకటేష్ 75’..!

  • October 30, 2019 / 06:46 PM IST

ఎంతమంది స్టార్ హీరోల ఫ్యాన్స్ … ‘మా హీరో గొప్ప.. మా సినిమా గొప్ప’ అంటూ సోషల్ మీడియాలో కొట్టుకుంటున్నప్పటికీ అందరి హీరోల అభిమానులకు ‘ఆల్ టైం హాట్ ఫేవరెట్’ సినిమా ఏదైనా ఉందా అంటే అది కచ్చితంగా ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమా అనే చెప్పాలి. ఇప్పటికీ ఈ చిత్రం టీవీల్లో టెలికాస్ట్ అవుతుంటే.. ప్రతీ ఒక్కరూ చేసే పనులన్నీ మరిచిపోయి మరీ ఈ సినిమానే చూస్తుంటారు అనడంలో అతిశయోక్తి లేదు. త్రివిక్రమ్ సంభాషణలకి వెంకీ కామెడీ టైమింగ్ తోడైతే ఎలా ఉంటుందో ఈ చిత్రం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక తరువాత వచ్చిన ‘మల్లీశ్వరి’ కూడా అదే స్థాయిలో అలరించింది.

దీంతో నేరుగా త్రివిక్రమ్ డైరెక్షన్లో వెంకటేష్ ఎప్పుడు నటిస్తాడు. వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా ఎప్పుడు వస్తుందా అని.. యావత్ సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ‘హారికా అండ్ హాసిని క్రియేషన్స్’ వారు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్టు అధికారిక ప్రకటన కూడా వచ్చింది. కానీ త్రివిక్రమ్, వెంకీ లు వారి వారి సినిమాలతో బిజీ అయిపోయారు. ఇక వెంకటేష్ ప్రస్తుతం ‘వెంకీమామ’ చిత్రంలో నటిస్తున్నాడు. ఇది వెంకటేష్ కు 73 వ చిత్రం. ఇది పూర్తయిన వెంటనే ‘అసురన్’ రీమేక్ లో నటించాడనికి వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక వెంకీ ల్యాండ్ మార్క్ 75 వ చిత్రాన్ని త్రివిక్రమ్ డైరెక్షన్లోనే చేయబోతున్నాడు వెంకీ అంటూ ఫిలింనగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ కు సంబందించిన చర్చలు కూడా జరుగుతున్నాయట. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ సెట్ అయితే వెంకీ అభిమానులకే కాదు.. యావత్ సినీ ప్రేక్షకులకీ పండగనే చెప్పాలి..!

విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus