వారధిగా త్రివిక్రమ్!!!

  • May 3, 2016 / 11:11 AM IST

సర్దార్ గబ్బర్ సింగ్ చేదు అనుభవం తరువాత…ఎస్.జె. సూర్య దర్శకత్వంలో పవన్ కల్యాణ్ ఒక సినిమాలో నటిస్తున్నాడు. అయితే సర్దార్ సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియాకు ఇచ్చిన వర్సుస ఇంటెర్వ్యు లలో పవన్ కల్యాణ్ తన సినీ కరియర్ పై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. “తాను మరో మూడు సినిమాలు మించి నటించను” అని చెప్పాడు, అయితే అందులో ఒక ఎస్.జె. సూర్య దర్శకత్వంలో వస్తున్న సినిమా కాగా, మరో రెండు ఇంకా తెలీదు. ఇదే క్రమంలో పవన్ దాసరిల సినిమా ఇక లేనట్లే అన్న వార్త అంతా తెలిసిపోయింది. ఇంతలో ఏమయిందో ఏమో గాని…గత కొద్ది రోజులుగా వస్తున్న వార్తలను బట్టి ఈ మూవీ ప్రాజెక్ట్ కు మళ్ళీ జీవం వచ్చినట్లు కనిపిస్తోంది. దానికి కారణం త్రివిక్రమ్….టాలీవుడ్ సర్కిల్స్ నుంచి వస్తున్న వార్తల ప్రకారం…..

టాలీవుడ్ టాప్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ దాసరిల కాంబినేషన్ లో పట్టాలేక్కబోయే సినిమాకు ఒక భారీ  కథను అందించేందుకు ఒప్పుకున్నట్లు సమాచారం. వ్యక్తిగతంగా త్రివిక్రమ్ కి అటు పవన్, ఇటు దాసరితో మంచి సత్సంబంధాలు ఉండడంతో…ఆగిపోయిన ఈ మూవీ ప్రాజెక్ట్ కు తన కథను అందించి తిరిగి దాసరి ఆశలకు జీవం పోస్తున్నాడని టాక్. ఇదిలా ఉంటే తాజాగా త్రివిక్రమ్ నితిన్-సమంతా కలయికలో ‘అ ఆ’ సినిమా చేసిన సంగతి తెలిసిందే… అయితే ఈ సినిమా విడుదల అయ్యాక ఈ మాటల మాంత్రికుడు పవన్ దాసరిల కోసం ఒక కధ సిద్దం చేసేందుకు రెడీ అవుతున్నాట్లు సమాచారం. ఇదిలా ఉంటే కధ వరకూ తాను సహాయ పడగలను అని, దర్శకత్వ బాధ్యతలు మాత్రం నా వల్ల కాదు అని త్రివిక్రమ్ తేల్చి చెప్పేసినట్లు సమాచారం. ఇక ఈ వార్తతో త్వరలోనే పవన్-త్రివిక్రమ్-దాసరి కాంబినేషన్ లో సినిమా కన్ఫర్మ్ అయినట్లు పక్కాగా తెలిసిపోతుంది. మరి ఈ సినిమాతో వీళ్ళ ముగ్గురు ఎటువంటి సంచలనం సృష్టించబోతున్నారో చూద్దాం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus