ఆయన మాటలు నవ్విస్తాయి. కన్నీళ్లు పెట్టిస్తాయి. ఆలోచింపజేస్తాయి. ఇప్పటికే ఆయన ఎవరో అర్ధమైపోయి ఉంటుంది. కరక్ట్ అతనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. కలాన్నే బలంగా చేసుకుని ఎదిగిన రచయిత. డైరక్టర్ గా మారిన కవి. పొదుపైన, పదునైన మాటలు వాడి అందమైన సినిమా కోటను కట్టగల ఘనుడు. అతని మెగా ఫోన్ నుంచి బయటికి వచ్చిన అతడు, జల్సా, జులాయి, అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల్లో పంచ్ పలుకులు రాసులై కనిపిస్తాయి. వాటిలో కొన్ని మీకందిస్తున్నాం.