‘జనతాగ్యారేజ్’ కు రెండు క్లైమాక్స్ లా..?

  • August 16, 2016 / 10:25 AM IST

గతంలో ఘర్షణ, ఏమాయ చేసావే వంటి సినిమాలు రెండు క్లైమాక్స్ తో వచ్చి సూపర్ హిట్స్ ను సాధించాయి. ఇప్పుడు ఎన్టీఆర్ “జనతా గ్యారేజ్” సినిమాకు కూడా రెండు క్లైమాక్స్ లు ఉండబోతున్నాయనే మాటలు జోరుగా వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్, మోహన్ లాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు.

తెలుగులో ఎన్టీఆర్ కు ఉన్న ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని ఒక క్లైమాక్స్ ను, మలయాళంలో మోహన్ లాల్ క్రేజ్ దృష్ట్యా మరో క్లైమాక్స్ ను చిత్రీకరిస్తున్నారని టాక్. రీసెంట్ గానే చిత్ర బృందం కేరళ షెడ్యూల్ ను పూర్తి చేసుకొని హైదరాబాద్ కు తిరిగొచ్చింది. సెప్టెంబర్ 2న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus