అల్లు అర్జున్ డీజే మూవీ పోస్టర్ లో ఆసక్తి కలిగిస్తున్న రెండు సంగతులు

  • February 18, 2017 / 06:18 AM IST

హరీష్ శంకర్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న దువ్వాడ జగన్నాధం సినిమా లో సౌండ్ హై అవుట్ పుట్ అనే రీతిలో చిత్రీకరణ సాగుతోంది.  ప్రముఖ నిర్మాత దిల్ రాజు తమ బ్యానర్లో 25 వ చిత్రంగా నిర్మిస్తున్న ఈ మూవీ లుక్ నేడు ఉదయం రిలీజ్ అయింది. చేతక్ స్కూటీ పైన కూరగాయలను పెట్టుకుని నడిపిస్తున్న అయ్యవారి గెటప్ లో అల్లు అర్జున్ లుక్ అదిరిపోయింది. ఎంతో ప్లజంట్ గా కనిపిస్తున్న ఈ లుక్ మెగా అభిమానులకు తెగ నచ్చేసింది. అయితే ఈ పోస్టర్ లో రెండు అంశాల గురించి నెటిజనులు ఎక్కువగా చర్చించుకుంటున్నారు. ఒకటి స్కూటీ నంబర్ 2425. హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ బైక్ కి ఈ నంబర్ ఉంటుంది.

సో ఆ హిట్ సెంటిమెంట్ ని ఈ మూవీలో డైరక్టర్ కొనసాగిస్తున్నారు. మరో అంశం “అన్నపూర్ణ కేటరింగ్సు, ప్యూర్ వెజిటేరియన్సు” .. అనే స్టిక్కర్. పోస్టర్ లో కూడా డైలాగ్ పేల్చి హాస్యం కొంచెం ఎక్కువగానే ఉంటుందని చెప్పారు. ఇక ఈ స్టిక్కర్ లో విజయవాడ అని రాసి ఉంది. అంటే కథ ఎక్కువభాగం విజయవాడలో సాగుతుందని అర్ధం చేసుకుంటున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus