బుల్లి తెర యాంకర్ గా ఒక ఊపు ఊపిన ఉదయ భాను, ఇద్దరు పిల్లలతో చాలా పీస్ఫుల్ గా, ఎంజాయ్ చేస్తుంది. ఎన్నో కష్టాలు అనుభవించి ఇప్పుడు రెస్ట్ తీసుకుంటుంది. అయితే…గ్లామర్ ఫీల్డ్ లో అంచెలంచెలుగా ఎదిగిన ఆమె లైఫ్ లో కష్టాలు ఉన్నాయి అంటే మీరు నమ్ముతారా…ఆమె మోసపోయింది అంటే నమ్మగలరా…ఆమెకు ఆర్ధిక ఇబ్బందులు ఉన్నాయి అంటే నమ్మగలరా?? అయితే ఇవే ప్రశ్నలు ఉదయభానుని అడిగినప్పుడు ఆమె ఏం చెప్పారు అంటే…వారిది చాలా పెడడ్ కుటుంభం అని, అంతేకాకుండా వారిది జమీందారీ కుటుంభం కావడంతో తొలుత డబ్బుకు లోటు ఉండేది కాదు అని, అయితే తనకు నాలుగు ఏళ్లు ఉన్నప్పుడే తన తండ్రి చనిపోవడంతో తన తల్లి ఆస్తిలో నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని.
ఆ తరువాత ఆర్ధికంగా నిలదొక్కుకునే క్రమంలో ఆకలు బాధలు చూశాను అని చెబుతుంది. అంతేకాకుండా లక్షలు..లక్షలు తీసుకుని సొంతవారే మోసం చేస్తే ఎలా ఉంటుందో ఆ బాధ ఏంటో తనకు తెలుసు అంటుంది. ఇక సహాయం విషయానికి వస్తే…అనాధలకు సహాయం చేస్తే…వారి కళ్ళలో ఆనందం జీవితాంతం గుర్తు ఉంటుంది అని తెలుపుతుంది. సొంతవారు సైతం మనం ఏదుగుతుంటే ఈర్ష్య పడతారు అని, కానీ, మన హెల్ప్ చేసిన వారు మాత్రం మనం జీవితాంతం ఎదగాలి అని కోరుకుంటారు అని తెలిపింది.