సినిమా పాటల కోసం కాకుండా, తన ప్రైవేట్ సాంగ్స్/ఆల్బమ్స్ కోసం తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander) ‘అల్బుకర్క్యూ రికార్డ్స్’ అనే కొత్త మ్యూజిక్ లేబుల్‌ని స్థాపించిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు ఈ లేబుల్‌లో వచ్చే పాటలను ప్రమోట్ చేసేందుకు, ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు ‘యూనివర్సల్ మ్యూజిక్ ఇండియా’ సంస్థతో అనిరుధ్ చేతులు కలిపినట్టు తెలుస్తుంది.
ఈ ఒప్పందం వల్ల సౌత్ ఇండియాలోని పాప్, హిప్-హాప్ మ్యూజిక్ రంగాల్లో యూనివర్సల్ మ్యూజిక్ వారు పట్టు సాధించే అవకాశం ఉంది. ఇందులో భాగంగా ఇక్కడ ఉన్న పాపులర్ సంగీత కళాకారుల టాలెంట్ కి కూడా గ్లోబల్ లెవెల్లో గుర్తింపు లభించే అవకాశం ఉంటుంది.అనిరుధ్ టాలెంట్ కేవలం సినిమాలకే పరిమితం కాకుండా, ఇండిపెండెంట్ మ్యూజిక్ ఆల్బమ్స్ చేయడం వల్ల అతనితో పాటు లోకల్ టాలెంట్ ని కూడా గ్లోబల్ లెవెల్ అప్రీషియేషన్ వచ్చే అవకాశం ఉండటం అనేది నిజంగా హర్షించదగ్గ అంశమే.
ఇక ఈ లేబుల్ కింద విడుదలయ్యే తొలి ప్రాజెక్ట్..లో అనిరుధ్ పాల్గొన్నారు. అలాగే ఏప్రిల్ లో విడుదల చేసేందుకు ప్లానింగ్ కూడా సిద్దం చేసుకున్నారు.ఇక సినిమాల విషయానికి వస్తే.. అనిరుథ్ ఇప్పుడు వరుసగా పెద్ద సినిమాలకి అందులోనూ పాన్ ఇండియా సినిమాలకి పనిచేస్తూ బిజీగా గడుపుతున్నాడు. అనిరుథ్ సంగీతం అందించే సినిమాలకి మంచి బజ్ ఏర్పడుతుండటాన్ని కూడా మనం గమనించవచ్చు. ఇక అతను సంగీతంలో రూపొందిన ‘జన నాయగన్’ ‘ది పారడైజ్’ వంటి సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి.