40 ఏళ్ళ వయసొచ్చినా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్స్..!

ఇప్పుడు అబ్బాయిలతో పాటు చాలా మంది అమ్మాయిలు కూడా ఉద్యోగాలు చేస్తూ వారితో సమానంగా సంపాదిస్తున్నారు కాబట్టి.. వాళ్ళ ధ్యాస పెళ్లి పై ఉండటం లేదని చాలా మంది అభిప్రాయపడుతుంటారు. సాధారణంగా అమ్మాయిలకు 20 ఏళ్ళ వయసు వచ్చిందంటేనే పెళ్లి చేసెయ్యాలని ఇంట్లో ఉన్న పెద్దోళ్ళు చూస్తుంటారు. ఒక వేళ చదువు పూర్తయ్యాక చేద్దాం అని వాళ్ళు ఎదురుచూస్తే అమ్మాయికి 25 ఏళ్ళు వచ్చే వరకూ ఆగుతారు. ఇక ఈమధ్య ఉద్యోగాల పేరు చెప్పి దానిని 30 కి కూడా పొడిగిస్తున్నారు అనుకోండి. ఇదిలా ఉండగా.. దాదాపు హీరొయిన్ల విషయంలో కూడా ఇలాగే జరుగుతుంటుంది. వాళ్ళు 20 ఏళ్లకు ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్ ఇమేజ్ సంపాదించుకున్నా.. గట్టిగా 5 లేదా 6 ఏళ్ల వరకూ రాణిస్తారు కాబట్టి పెళ్లికి దూరంగా ఉంటారు అనుకోవచ్చు. చాలా మంది 30 ఏళ్ళ వయసుకి మించకుండానే పెళ్లిల్లు చేసుకుంటారు. ఒకవేళ మించినా అది 40 వరాకూ రానివ్వరు. కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రం 40 ఏళ్ల వయసు దాటినా.. ఇంకా పెళ్లి గురించి ఆలోచించడం లేదు. వాళ్ళు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :

1) శోభన :

అప్పట్లో చిరు, బాలయ్య, నాగార్జున వంటి హీరోలతో కలిసి నటించిన ఈ బ్యూటీ.. 50 ఏళ్ల వయసొచ్చినా పెళ్లి చేసుకోలేదు.

2)సితార :

హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ నటి.. తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడింది. 47ఏళ్ళ వయసొచ్చినా ఇప్పటికీ ఈమె పెళ్లి చేసుకోలేదు.

3)నగ్మా :

తెలుగుతో పాటు తమిళంలో కూడా స్టార్ హీరోయిన్! ఈమె వయసు కూడా 45 ఏళ్ళు. అయినా ఇంకా ఈమె పెళ్లి చేసుకోలేదు.

4)టబు :

ఈమె కూడా టాలీవుడ్ స్టార్ హీరోయినే..! 48 ఏళ్ళ వయసొచ్చిన టబు కూడా పెళ్లి గురించి ఆలోచించడం లేదు.

5)సుస్మితా సేన్:

విశ్వ సుందరి సుస్మితా సేన్ వయసు కూడా 44 ఏళ్లు. ఈమె కూడా పెళ్లి చేసుకోలేదు.

6) కౌసల్య :

‘అల్లుడుగారు వచ్చారు’ ‘పంచదార చిలక’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనా ఈ నటి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తుంది. ఈమె కూడా 40 ఏళ్ల వయసొచ్చినా ఇంకా పెళ్లి చేసుకోలేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus