నాని భామ ఎంత క్యూట్ గా ఉందో..!

  • September 16, 2019 / 08:17 PM IST

టాలీవుడ్ కు కొత్త కొత్త హీరోయిన్లని పరిచయం చేయడంలో ఇప్పుడు అందరికంటే ముందుంటున్నాడు నేచురల్ స్టార్ నాని. ఇప్పటివరకూ చాలా మంది హీరోయిన్లని పరిచయం చేసిన క్రెడిట్ నానికే దక్కింది. ‘అష్టా చమ్మా’ ద్వారా కలర్స్ స్వాతిని హీరోయిన్ గా పరిచయం చేసాడు. తర్వాత ఆమె చాలా సక్సెస్ ఫుల్ సినిమాల్లో నటించింది. అటుతరువాత ‘అలా మొదలైంది’ చిత్రంతో నిత్యా మేనన్ ను పరిచయం చేశాడు. నిత్య కూడా మంచి క్రేజీ హీరోయిన్ అయిపొయింది. మాళవికా నాయర్, మెహ్రీన్ కౌర్, నివేదా థామస్, అనూ ఇమాన్యుల్, శ్రద్దా శ్రీనాథ్ వంటి హీరోయిన్లు నాని ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళే కావడం విశేషం. ఇప్పుడు తన ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ చిత్రం ద్వారా మరో హీరోయిన్ ను పరిచయం చేశాడు. ఆమెనే ప్రియాంక అరుల్ మోహన్.

విక్రమ్ కుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ సినిమాలో ‘ప్రియ’ పాత్ర పోషించిన ప్రియాంక అరుల్ మోహన్ కుర్ర కారు హృదయాల్ని కొల్లగొట్టింది. ముందు నుండీ విడుదల చేస్తున్న ప్రోమోస్ నుండీ ఈ భామ గురించి సెర్చింగులు మొదలైపోయాయి. ఇక సినిమా విడుదలయ్యాక ఈ అమ్మడి పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తుంది. కచ్చితంగా ఈ భామ భవిష్యత్తులో పెద్ద హీరోయిన్ అవుతుందని వారు కామెంట్స్ చేస్తున్నారు. ఈ చిత్రానికి ముందు ఈ భామ కన్నడంలోనూ అలాగే తమిళంలో కూడా సినిమాలు చేసింది. గతంలో నాని పరిచయం చేసిన హీరోయిన్ల లానే ఈమె కూడా పెద్ద హీరోయిన్ అవుతుందేమో చూడాలి. ఇక ఈ భామకి సంబందించిన కొన్ని అన్ సీన్ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కెయ్యండి.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
పహిల్వాన్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus