ఆశ్చర్యపరిచిన అమితాబ్ ఆస్తుల వివరాలు..!

Advertisement

మన టాలీవుడ్ లో చిరంజీవి నట, రాజకీయ ప్రస్థానం ఎంత స్పూర్తిదాయకమైనవో.. బాలీవుడ్ లో అమితాబ్ ప్రస్థానం కూడా అంతే విలువైనవి. సాధారణ నటుడిగా కెరీర్ ను ఆరంభించి, ఎవరి సపోర్ట్ లేకుండా మెగాస్టార్ గా ఎదిగిన తీరు ఎందరికో ఆదర్శనీయం. అలాగే.. 75 ఏళ్ల వయసులోనూ విరామం తీసుకోకుండా ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూ కళామతల్లికి సేవలందిస్తున్న అమితాబ్ ఆస్తుల లెక్కింపు ఇటీవల ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ సందర్భంగా బేరీజు వేయడం జరిగింది.

కేవలం అమితాబ్ పేరు మీదే 800 కోట్ల రూపాయల ఆస్తి ఉండగా.. జయా బచ్చన్ పేరు మీద 200 కోట్ల ఆస్తి ఉంది. అంటే అమితాబ్ ఆస్తుల విలువ వెయ్యి కోట్లన్నమాట. ఇందులో మళ్ళీ అభిషేక్, ఐశ్వర్యల సంపాదనను యాడ్ చేయలేదు. వారిది కూడా యాడ్ చేస్తే ఇంకో 500 కోట్లు ప్లస్ అవ్వడం ఖాయం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus