అఖిల్ పెళ్లి గురించి అక్కినేని కుటుంబ సభ్యులు నోరు మెదపడం లేదు. అటు శ్రీయా భూపాల్ వైపు నుంచి ఎటువంటి స్పందన లేదు. అఖిల్ తన స్నేహితురాలైన శ్రీయా భూపాల్ ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. వీరిద్దరికి పెద్దలు ఘనంగా నిశ్చితార్థం నిర్వహించారు. యూరప్ లో పెళ్లిని జరిపించేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. తెలుగు సంప్రదాయం ప్రకారం శ్రియ కుటుంబ సభ్యులు కూడా పసుపుకొట్టి మరీ పెళ్లి పనులు మొదలుపెట్టారు. ఎంతో వైభవంగా జరుగుతుందన్న పెళ్లి క్యాన్సిల్ అయినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. అఖిల్, శ్రీయా మధ్య గొడవ జరిగిందని, వారినికలపాలని పెద్దలు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందని కథనం సారాంశం. ఇప్పుడో మరో న్యూస్ హల్ చల్ చేస్తోంది.
వీరిద్దరిని కలిపేందుకు మెగాస్టార్ కోడలు ఉపాసన రంగంలో దిగిందంట. ఈమె శ్రీయాకి బెస్ట్ ఫ్రెండ్. అందుకే ఆమె మాట వింటుందని అందరూ భావిస్తున్నారు. ఇక అఖిల్ తోను ఉపాసనకు మంచి స్నేహం ఉంది. సో ఈ ప్రయత్నంలో ఉపాసన విజయం సాదిస్తుందని, అక్కినేని ఇంట పెళ్లి గంటలు త్వరలో మోగుతుందని ఆశిస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.