వీకెండ్ మూవీస్ లిస్ట్ .!

  • April 26, 2018 / 10:37 AM IST

ఆల్రెడీ “భరత్ అనే నేను” బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి థియేటర్స్ అన్నీ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో నడుస్తున్నాయి. అయితే.. ఇప్పుడే ఎగ్జామ్స్ పూర్తయ్యి హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్న యూత్ కి క్రికెట్, టీవి, పబ్స్ అంటూ ఎన్ని ఆప్షన్స్ ఉన్నా.. కొత్త సినిమా అనేది చూడకపోతే మనసు ఎక్కడ కుదుటపడుతుంది చెప్పండి. అందుకే ఈవారం ఆడియన్స్ కోసం మూడు సినిమాలు రెడీగా ఉన్నాయి. సడన్ గా రేస్ లోకి దూకిన సాయిపల్లవి-శౌర్య నటించిన “కణం” ఈ వారం విడుదలవుతోంది. ఇంటెన్స్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంపై ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ మరియు సాయిపల్లవి అభిమానుల్లో విశేషమైన అంచనాలున్నాయి.

అలాగే.. మంచు విష్ణు నటించిన “ఆచారి అమెరికా యాత్ర” కూడా ఈ వారం విడుదలవుతోంది. కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రం ఎట్టకేలకు రేపు విడుదలవుతోంది. ఈ రెండు తెలుగు సినిమాలకి ఏమాత్రం తీసిపోకుండా, కరెక్ట్ గా చెప్పాలంటే ధీటుగా హాలీవుడ్ యాక్షన్ ఫిలిమ్ “ఎవెంజర్స్” విడుదలవుతోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ విడుదలవుతున్న ఈ చిత్రం కేవలం ఇండియాలోనే 2000 స్క్రీన్ లో విడుదలవుతుండడం విశేషం. పైగా.. ఈ చిత్రం తెలుగు వెర్షన్ లోని విలన్ పాత్రకు రాణా డబ్బింగ్ చెప్పడం ప్రత్యేకతను సంతరించుకొంది. ఆల్రెడీ బ్లాక్ బస్టర్ హిట్ గా డిక్లేర్ చేయబడ్డ “ఎవెంజర్స్” ముందు “కణం, ఆచారి అమెరికా యాత్ర” ఏమేరకు నిలబడతాయో చూద్దాం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus