మహేష్-అనిల్ రావిపూడి సినిమాను రిజెక్ట్ చేసిన ఉపేంద్ర

  • March 12, 2019 / 07:40 PM IST

“మహర్షి” అనంతరం మహేష్ బాబు “ఎఫ్ 2″తో సూపర్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం తొలుత సాయిపల్లవిని కథానాయికగా అనుకొన్నప్పటికీ.. సాయిపల్లవి ఆఫర్ ను రిజక్ట్ చేయడంతో ఆమె స్థానంలో రష్మికను ఎంపిక చేసుకున్నారు. ఆ తర్వాత సినిమాలో మరో ముఖ్యపాత్ర కోసం విజయశాంతి మరియు ఉపేంద్రను ఫైనల్ చేసినట్లు వార్తలొచ్చాయి.

విజయశాంతి నుంచి ఇంకా కన్ఫర్మేషన్ లేదు కానీ.. నిన్న సాయంత్రం తన తాజా చిత్రం “ఐ లవ్ యు” సినిమా ప్రమోషన్స్ కోసం హైద్రాబాద్ వచ్చిన ఉపేంద్రను మహేష్ సినిమాలో నటిస్తున్నారా అని అడిగినప్పుడు చేయడం లేదని చెప్పేశాడు ఉపేంద్ర. అంతేకాక.. తనను మహేష్ చిత్రబృందం సంప్రదించినప్పటికీ.. తన డేట్స్ ఖాళీ లేకపోవడంతో తాను ఈ సినిమా చేయలేకపోతున్నాని క్లారిటీ ఇచ్చాడు. ముందు సాయిపల్లవి, ఇప్పుడు ఉపేంద్ర ఇలా మహేష్ బాబు సినిమాను రిజెక్ట్ చేస్తుండడం ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus