పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ డైరెక్షన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh). మార్చి 19న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి.
రీసెంట్‌గా చాలా సినిమాల టైటిల్స్ మార్చాలని సెన్సార్ బోర్డు అబ్జెక్షన్ చెప్పడంతో, ఈ మూవీ టైటిల్‌పై కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ, ఎలాంటి అడ్డంకులు లేకుండా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టైటిల్‌ను బోర్డు క్లియర్ చేయడం పెద్ద రిలీజ్ ఇచ్చే విషయం.
ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యు/ఎ సర్టిఫికెట్ జారీ చేసింది. ఫస్ట్ హాఫ్ మొత్తం సూపర్ ఎంటర్‌టైనింగ్‌గా ఉంటూ, ఇంటర్వెల్ బ్యాంగ్ బ్లాక్‌బస్టర్ లెవెల్‌లో ఉంటుందని ఇన్‌సైడ్ టాక్. సెకండాఫ్ ఫుల్ ఎమోషనల్ రైడ్‌తో పాటు పవన్ పీక్ పెర్ఫార్మెన్స్ చూడబోతున్నారట. ఓవరాల్‌గా రన్‌టైమ్ 2 గంటల 29 నిమిషాలతో పక్కా కమర్షియల్ ప్యాకేజీలా ఈ సినిమా రెడీ అయ్యిందని తెలుస్తుంది.
బిజీ షెడ్యూల్స్ ఉన్నా పవన్ కళ్యాణ్ రెండు రోజుల పాటు ఏకధాటిగా కష్టపడి తన డబ్బింగ్ పార్ట్ పూర్తి చేశారు. ప్రమోషన్స్ స్పీడ్ పెంచేందుకు డైరెక్టర్ హరీష్ శంకర్ టీమ్ సిద్ధమైంది. సినిమాలోని 3వ పాట ప్రోమోని ఈరోజే విడుదల చేయనున్నారు.. మరో రెండు రోజుల్లో ట్రైలర్‌ను లాంచ్ చేయనున్నారు. అంతేకాకుండా, సినిమా ప్రమోషన్స్ కోసం పవన్ రెండు రోజుల పాటు స్పెషల్ టైమ్ కేటాయించడం విశేషం.
‘మైత్రీ మూవీ మేకర్స్’ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ మాస్ ఎంటర్‌టైనర్‌లో పవన్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సాంగ్స్ కంపోజ్ చేయగా, తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. మార్చి 19న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.