వయ్యారి వాణీ మరీ ఇలా రెచ్చగొడితే ఎలా..!

నానీ హీరోయిన్ అని హెడ్డింగ్ పెట్టి ఎవరో బాలీవుడ్ బ్యూటీ ఫోటో పెట్టారెంటా అని ఆలోచించేస్తున్నారా.. ఆమె నిజంగానే నానీ హీరోయినండీ బాబు. మన నాని బాబు వరుస ఫ్లాపుల్లో ఉన్నప్పుడు బాలీవుడ్ సూపర్ హిట్ ఫిలిమ్ “బ్యాండ్ బాజా బరాత్” కు రీమేక్ గా తెలుగు-తమిళ భాషల్లో “ఆహా కళ్యాణం” అనే సినిమా ఒకటి చేశాడు గుర్తుందా.. గబుక్కున గుర్తురాడులెండి.. ప్రఖ్యాత నిర్మాణ సంస్థ “యష్ రాజ్ ఫిలిమ్స్” నిర్మించిన ఈ చిత్రం తెలుగులో ఎప్పుడు విడుదలై.. ఎప్పుడు థియేటర్ల నుండి వెళ్లిపోయిందో నానీ వీరాభిమానులకు కూడా సరిగా ఐడియా లేదు.

ఆ సినిమాలో నానీకి ముచ్చటగా మూడునాలుగు మూతి ముద్దులు.. అదేనండి లిప్ లాక్స్ కూడా ఇచ్చిన వాణీ కపూర్ కు పాపం ప్రస్తుతం ఆఫర్లు ఏమీ లేవు. భారీ అంచనాల నడుమ విడుదలైన “బేఫికర్” బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టడంతో.. అమ్మడిని పట్టించుకొనే నాధుడు బాలీవుడ్ లోనే కాదు ఏ వుడ్ లోనూ లేకుండాపోయాడు. అందుకే ప్రస్తుతానికీ కొన్ని మ్యాగజైన్స్ కోసం హాట్ ఫోటోషూట్స్ చేస్తూ.. ఆ ఫోటోల్లో అందాలను అత్యంత ఉదారంగా ఆరబోస్తూ.. ఎవరైనా ఆ అందాలు చూసైనా ఆఫర్లు ఇవ్వకపోతారా అని ఆశగా ఎదురుచూస్తోంది. మరి అమ్మడి ప్లానింగ్ వర్కవుట్ అయ్యి త్వరలోనే ఏదైనా మాంచి సినిమా పడుతుందేమో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus