Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

‘గీత గోవిందం’ ‘అల వైకుంఠపురములో’ ‘టక్ జగదీష్’ వంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేసిన వైష్ణవి చైతన్యకి ‘బేబీ’ సినిమా హీరోయిన్‌గా మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ ఒక్క సినిమాతో వైష్ణవి(Vaishnavi Chaitanya) ఓవర్‌నైట్ స్టార్‌గా అవతరించింది. అంతేకాదు ‘బేబీ’ సినిమాలో మేజర్ సక్సెస్ క్రెడిట్ ఆమెదే అన్నట్టు ప్రచారం జరిగింది. దీంతో వైష్ణవి తర్వాతి సినిమాలపై కొంత భారం కూడా పెరిగిందని చెప్పాలి. ‘లవ్ మీ’ ‘జాక్’ వంటి పెద్ద సినిమాల్లో నటించింది వైష్ణవి. కానీ అవి రెండూ దారుణంగా ఫ్లాప్ అయ్యాయి.

Vaishnavi Chaitanya

ఆల్మోస్ట్ వైష్ణవి పని అయిపోయింది అంటున్న టైమ్‌లో ఆమెకు ‘ఎపిక్’ సినిమాలో ఛాన్స్ లభించింది. టాప్ బ్యానర్ ‘సితార ఎంటర్‌టైన్‌మెంట్స్’పై నాగవంశీ నిర్మించిన సినిమా ఇది. ’90’s’ వెబ్ సిరీస్‌తో ఫ్యామిలీ ఆడియన్స్‌ను అలరించిన ఆదిత్య హాసన్ దీనికి దర్శకుడు. పైగా ’90’s’కి సీక్వెల్ అని అనౌన్స్ చేశారు. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించాడు. ‘బేబీ’ కాంబో కావడంతో అంచనాలు పెరిగాయి. కానీ రిలీజ్ అయిన మొదటి రోజే ఈ సినిమాకి మిక్స్‌డ్ టాక్ వచ్చింది.

సినిమా కొంతమందికి నచ్చింది. ఇంకొంతమందికి నచ్చలేదు. నచ్చని వాళ్ళు ‘ఎపిక్’ మేకర్స్‌ని ఏ రేంజ్‌లో ట్రోల్ చేశారంటే.. నెక్స్ట్ లెవెల్ ట్రోలింగ్ అన్నమాట. ఈ సినిమా ఫలితం ఎవరి కెరీర్‌పై ఎక్కువ ప్రభావం చూపుతుంది అనే లెక్కలు కూడా వేసుకున్నారు. నాగవంశీకి ‘ఎపిక్’తో పెద్దగా ఫరక్ పడదు. ఆదిత్య హాసన్ కూడా నెక్స్ట్ ప్రాజెక్టు పట్టేశాడు. ఆనంద్ దేవరకొండ 2 ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. కానీ ఎటొచ్చీ వైష్ణవి కెరీర్ గురించే పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

‘ఈమె పని అయిపోయింది’ ‘ఇలాంటి వల్గర్ రోల్సే వైష్ణవి చేస్తుందేమో’ అని ఫ్యామిలీ ఆడియన్స్.. వైష్ణవి స్టోరీ సెలక్షన్‌పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే వైష్ణవి చేతిలో ప్రస్తుతం 2 ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో ఒకటి తమిళ హీరో ఆర్యతో చేస్తున్న రోమ్-కామ్ కామెడీ మూవీ. ఇంకోటి నితిన్ హీరోగా నారి సిరి స్వాద డైరెక్ట్ చేస్తున్న ఫ్యామిలీ మూవీ. ఆర్యతో చేస్తున్న సినిమా హిట్ అయితే వైష్ణవి తమిళంలో బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఇక నితిన్‌తో చేస్తున్న సినిమా కనుక హిట్ అయితే.. టాలీవుడ్‌లో ఆమె మంచి కమ్‌బ్యాక్ ఇచ్చినట్టే..! ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే.. నితిన్‌తో వైష్ణవి చేస్తున్న సినిమాని కూడా ‘సితార ఎంటర్‌టైన్‌మెంట్స్’ సంస్థపై నాగవంశీ నిర్మిస్తున్నట్టు సమాచారం. కొన్ని లీక్డ్ విజువల్స్ తప్ప.. ఈ ప్రాజెక్టు గురించి మిగతా వివరాలేవీ బయటకు రాలేదు.

ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus