తెలుగు హీరోలు పట్టించుకోకపోవడంతో కన్నడ హీరోని పట్టుకున్న అల్లు అర్జున్ డైరెక్టర్..!

  • October 14, 2019 / 12:40 PM IST

ఒకప్పుడు అతను టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ రైటర్. మహేష్, ఎన్టీఆర్ , రాంచరణ్ , అల్లు అర్జున్ ఇలా స్టార్ హీరోలందరి సినిమాలకు పనిచేసాడు. ఆ తరువాత డైరెక్టర్ గా మారి ఓ సినిమా చేసాడు. అది పెద్ద ప్లాప్ అయ్యింది. అంతే ఇక రైటర్ గా కూడా అవకాశాలు రావడం లేదు. ఆ డైరెక్టర్ కమ్ రైటర్ ఎవరో ఈపాటికే మీకు తెలిసిపోయి ఉంటుంది కదా..! అతనేనండీ.. మన వక్కంతం వంశీ.

అల్లు అర్జున్ తో ‘నా పేరు సూర్య .. నా ఇల్లు ఇండియా’ చిత్రం డైరెక్ట్ చేసిన వంశీ.. ఆ చిత్రం ప్లాప్ కావడంతో… పెద్ద హీరోలే కాదు కనీసం మీడియం హీరోలు కూడా అవకాశాలు ఇవ్వకపోవడంతో కన్నడ ఇండస్ట్రీకి చెక్కేస్తున్నాడట. అక్కడి క్రేజీ హీరో దర్శన్ తో ఓ సినిమా చేయబోతున్నాడట. మరి అక్కడయినా సక్సెస్ అవుతాడేమో చూడాలి..!

బాలీవుడ్ లో మంచి కలెక్షన్లు రాబట్టిన సౌత్ సినిమాలు..?
చిరంజీవి అతిధి పాత్ర చేసిన సినిమాలు?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus