టైటిల్‌ వివాదం.. వాల్మీకి సినిమా పేరు మారింది!

  • September 19, 2019 / 11:36 PM IST

ఇప్పటి వరకూ క్లాస్ సినిమాలు, ప్రయోగాత్మక సినిమాలే చేస్తూ వచ్చిన వరుణ్ తేజ్ మొదటి సారి ఫుల్ మాస్ అవతారంలో అలరించడానికి రెడీ అయ్యాడు. వాల్మీకీ టైటిల్ పై వివాదం రేగుతుండటంతో హైకోర్టు ఆదేశాల మేరకు టైటిల్ మార్చింది చిత్ర యూనిట్. వాల్మీకి పేరును తొలగించి గద్దలకొండ గణేశ్ అనే కొత్త టైటిల్ ను పెడుతున్నట్లు మూవీ డైరెక్టర్ తెలిపారు. హరీష్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం కోలీవుడ్ లో సూపర్ హిట్టైన ‘జిగర్తాండ’ చిత్రానికి రీమేక్. వరుణ్ తేజ్ కు జంటగా పూజ హెగ్దే నటించింది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించారు.

క్రైమ్ సినిమాకు ఈ టైటిల్ పెట్టి తమ కులాన్ని అవమానిస్తున్నారని వదిలేది లేదంటూ బోయ కులస్థులు ఆందోళన చేపట్టారు. వాల్మీకి టైటిల్ మార్చాలని బోయ హక్కుల పోరాట సమితి హైకోర్టులో పిటిషన్ వేసింది. పిటిషన్ పై చిత్ర యూనిట్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే వివాదాల మేరకు టైటిల్ ను గడ్డలకొండ గణేష్ అని మారుస్తున్నట్లు మూవీ ప్రొడ్యూసర్, డైరెక్టర్ కోర్టుకు తెలిపారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus