Varanasi : ‘వారణాసి టు వరల్డ్’.. గ్లోబల్ అప్పియరెన్స్ గ్లింప్స్ కు సర్వం సిద్ధం !

Advertisement

ప్రపంచ సినీ వేదికపై తెలుగు సినిమా మరోసారి తన సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. దర్శక దిగ్గజం S. S. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘వారణాసి’ నుంచి ఇప్పుడు మరో తాజా అప్డేట్ సినీ ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. “Varanasi to the World” అనే ప్రత్యేక గ్లోబల్ గ్లింప్స్‌ను మెక్సికోలో జరగనున్న CCXP మెక్సికో 2026 వేదికపై ప్రదర్శించేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు.

Varanasi

ఏప్రిల్ 24 నుంచి 26 వరకు జరిగే ఈ అంతర్జాతీయ ఈవెంట్‌లో, సాధారణ టీజర్ లేదా ట్రైలర్ కాకుండా, గ్లోబల్ ఆడియన్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన విజువల్ ప్రెజెంటేషన్‌ను ప్రదర్శించనున్నారు. ఇందులో ఇప్పటివరకు ఎక్కడా చూడని హై క్వాలిటీ BTS (బిహైండ్ ది సీన్స్) ఫుటేజ్‌తో పాటు, సినిమాకు సంబంధించిన కీలక అంశాలను చూపించే ప్రత్యేక కంటెంట్ ఉంటుందని సమాచారం. ఇదే కాదు, చిత్రంలోని ప్రధాన పాత్రలు, కథా నేపథ్యంపై కూడా కొంత ఆసక్తికరమైన వివరాలు అందించే అవకాశం ఉందట.

ఈ ప్రాజెక్ట్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తుండగా, ఆయనకు జోడీగా గ్లోబల్ ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా కనిపించనున్నారు. అలాగే పృథ్విరాజ్ సుకుమారన్ ఒక పవర్‌ఫుల్ నెగటివ్ షేడ్ పాత్రలో మెప్పించనున్నారు. ఈ భారీ చిత్రాన్ని K. L. నారాయణ నిర్మిస్తున్నారు.

షూటింగ్ పనులతో బిజీగా ఉన్నప్పటికీ, రాజమౌళి ఈ ఈవెంట్‌లో వీడియో మెసేజ్ ద్వారా అభిమానులతో మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆయన కుమారుడు కార్తికేయ అక్కడి ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారట.

భారీ బడ్జెట్‌తో, అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా IMAX ఫార్మాట్‌లో విడుదల కానుంది. మొత్తానికి ‘వారణాసి’ గ్లోబల్ స్టేజ్‌పై తన తొలి అడుగు వేయబోతుండటం, తెలుగు సినిమా రేంజ్‌ను మరోస్థాయికి తీసుకెళ్తుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

Adarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ ప్రాజెక్ట్ కి కొత్త మ్యూజిక్ డైరెక్టర్.. హర్షవర్ధన్ సైడ్ అవ్వటానికి కారణాలు ఏంటంటే ?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus