Varanasi: ‘వారణాసి’ బిజినెస్ లెక్కలకు డిస్ట్రిబ్యూటర్లు ఫ్లాట్

ఇండియన్ సినిమాలో రాజమౌళి పేరు ఒక బ్రాండ్. జక్కన్న సినిమా వస్తుందంటే చాలు బాక్సాఫీస్ లెక్కలు మారిపోవాల్సిందే. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో జక్కన్న తీస్తున్న ‘వారణాసి’ చుట్టూ ఇప్పుడే బిజినెస్ సెగ మొదలైపోయింది. షూటింగ్ ఇంకా జరుగుతుండగానే, ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కోసం డిస్ట్రిబ్యూటర్లు ఇస్తున్న ఆఫర్లు చూస్తుంటే ట్రేడ్ వర్గాలకు మతిపోతోంది. రాజమౌళి తన పాత రికార్డులను తనే బద్దలు కొట్టేలా పక్కా ప్లానింగ్‌తో ముందుకు సాగుతున్నారు.

Varanasi

బాహుబలి నుంచి ఆర్ఆర్ఆర్ వరకు రాజమౌళి సినిమాలన్నీ ఒక ప్రత్యేకమైన ప్యాటర్న్‌ను ఫాలో అవుతున్నాయి. ప్రతీ కొత్త సినిమా తన మునుపటి రికార్డులను దాదాపు డబుల్ చేస్తూ ప్రీ రిలీజ్ బిజినెస్‌లో సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేస్తోంది. ఇప్పుడు ‘వారణాసి’ విషయంలో కూడా అదే రిపీట్ అవుతోంది. ఆంధ్ర, నైజాం ఏరియాల్లో వినిపిస్తున్న రేట్లు వింటే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. ఇంకా అఫీషియల్‌గా ఏ డీల్ క్లోజ్ కాకముందే, డిస్ట్రిబ్యూటర్ల మధ్య జరుగుతున్న చర్చలే ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి.

ఈ రేంజ్ డిమాండ్‌కు మెయిన్ రీజన్ రాజమౌళిపై ఉన్న నమ్మకం. ఆయన సినిమాలు కేవలం మూవీస్‌లా కాకుండా ఒక ‘సినిమాటిక్ ఈవెంట్’లా ఉంటాయి. అందుకే బయ్యర్లు ఈ ప్రాజెక్ట్‌ను సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్‌గా భావిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబును ‘రుద్ర’గా ఒక పవర్‌ఫుల్ రోల్‌లో చూపించబోతున్నారు. హాలీవుడ్ లెవల్ యాక్షన్, అడ్వెంచర్ టైమ్ ట్రావెల్ ఎలిమెంట్స్ ఉండటంతో, గ్లోబల్ లెవల్‌లో ఈ సినిమాకు తిరుగుండదని బయ్యర్లు ఫిక్స్ అయిపోయారు.

ప్రస్తుతం జరుగుతున్న చర్చల ప్రకారం.. కొన్ని ఏరియాల్లో కోట్ చేస్తున్న ధరలు మార్కెట్ అంచనాలకు అందనంత ఎత్తులో ఉన్నాయి. ఒకవేళ ఈ బేరసారాలు గనుక మేకర్స్ అనుకున్న రేటుకే సెటిల్ అయితే, ఇండియన్ సినిమా హిస్టరీలోనే ‘వారణాసి’ బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రంగా నిలుస్తుంది. డిజిటల్ రైట్స్ కోసం నెట్‌ఫ్లిక్స్ వంటి సంస్థలు ఇప్పటికే రూ. 650 కోట్ల వరకు ఆఫర్ చేసినట్లు వార్తలు వచ్చాయి. థియేట్రికల్ బిజినెస్ కూడా అదే రేంజ్‌లో ఉండబోతోంది. 2027 ఏప్రిల్ 7న ఉగాది కానుకగా విడుదల కానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 3000 కోట్ల మార్క్‌ను టార్గెట్ చేస్తోంది. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి స్టార్స్ తోడవ్వడంతో సినిమా రేంజ్ ఇంటర్నేషనల్ లెవల్‌కు వెళ్ళింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus