Varanasi: ‘వారణాసి’ రిలీజ్‌పై ఐపీఎల్ ఎఫెక్ట్.. రిలీజ్ డేట్ మారనుందా?

మహేష్ బాబు, దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక ఫాంటసీ చిత్రం ‘వారణాసి'(Varanasi). 2027 ఏప్రిల్ 7న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు ఇది వరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు ఆ డేట్ మారబోతున్నట్టు ప్రచారం మొదలైంది. అధికారికంగా ఈ విషయాన్ని టీం అయితే ప్రకటించలేదు. కానీ రాజమౌళికి అత్యంత సన్నిహిత వర్గం ఈ విషయాన్ని తెలియజేసినట్టు స్పష్టమవుతుంది.

Varanasi

రిలీజ్ డేట్ వాయిదా పడటం వెనుక ఉన్న కారణం ఏంటని వారిని ప్రశ్నించగా.. ‘ఐపీఎల్’ అంటూ వారు బదులిచ్చినట్టు తెలుస్తోంది. అవును మార్చి నెల చివరి నుండీ ఐపీఎల్ హడావిడి మొదలవుతుంది. ఐపీఎల్ ప్రియులు ఆ టైమ్లో ధియేటర్ కి వచ్చి సినిమాలు చూసేందుకు ఇష్టపడరు. గత 2,3 ఏళ్ళ నుండీ సమ్మర్లో పెద్ద సినిమాలు రిలీజ్ కాకపోవడానికి కూడా ఇదే కారణం అని ఇండస్ట్రీలో టాక్ గట్టిగా వినిపించింది.

అన్నీ ఎలా ఉన్నా.. 2022 లో రిలీజ్ అయిన రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా వసూళ్లపై కూడా ఐపీఎల్ ఎఫెక్ట్ పడింది. ‘బాహుబలి 2’ రేంజ్ వసూళ్లకి దగ్గరగా ఆ సినిమా వెళ్లకపోవడానికి అదొక కారణం అని ట్రేడ్ పండితులు సైతం అభిప్రాయపడ్డారు. అందుకే ‘వారణాసి’ విషయంలో ఆ రిస్క్ తీసుకోవడానికి రాజమౌళి సిద్దంగా లేరు అని సమాచారం. షూటింగ్ అయితే కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు నడుస్తున్నాయి.

వీఎఫ్ఎక్స్ కోసం 6 నెలల వరకు సమయం పడుతుందట. ప్రమోషన్ కోసం 2 నెలల పాటు సమయం కేటాయించాలని రాజమౌళి భావిస్తున్నారు. అందుకే 2027 జూలై 31న ‘వారణాసి’ని విడుదల చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్టు వినికిడి. అదే డేట్ కి గతంలో ‘మగధీర’ రిలీజ్ అవ్వడం అది ఇండస్ట్రీ హిట్ అవ్వడం జరిగింది. సెంటిమెంట్ గా ఆ డేట్ కలిసొస్తుందని అంతా భావిస్తున్నారు. చూద్దాం ఫైనల్ గా ఏం అవుతుందో..!

మిక్స్డ్ టాక్ తో మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘డి ఎన్ కె’

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus