నాగార్జునపై ప్రేమను కురిపించిన వర్మ

  • March 13, 2018 / 05:54 AM IST

లైఫ్ ఇచ్చిన వారికీ ఎవరైనా జీవితాంతం రుణపడి ఉంటారు. ఆ కృతజ్ఞతాభావం వర్మలో కనిపిస్తుంది. తనని దర్శకుడిగా పరిచయం చేసిన నాగార్జునపై అవకాశం వచ్చినప్పుడల్లా అభినందనల వర్షం కురిపిస్తుంటారు. అలాగే శివ లాంటి సినిమాని మళ్ళీ నాగార్జునకు ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు. శివ తర్వాత అంతం, గోవిందా గోవిందా తీసినప్పటికీ అవి విజయ వంతం కాలేదు. ఈ సారి ఎలాగైనా హిట్ ఇవ్వాలని ఆఫీసర్ అనే సినిమాని తీశారు. వర్మ స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రం దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. కొన్ని ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలివుంది, రఫ్ ఎడిటింగ్ పూర్తి అయిన తర్వాత కావాల్సిన షాట్స్ కోసం నాగ్ మళ్ళీ ఆఫీసర్ టీమ్ తో కలవనున్నారు.

ఆఖరి షెడ్యూల్ పూర్తిచేసి హైదరాబాద్ కి వచ్చిన నాగ్… ఇప్పటివరకు తీసిన సన్నివేశాలన్నీ అద్భుతంగా వచ్చాయని, ఆర్జీవీని, అతడి టీమ్ ను మిస్ అవుతున్నానంటూ బాధపడే ఎమోజీలతో ట్వీట్ చేశాడు. ఇందుకు వర్మ కూడా తనదైన శైలిలో స్పందించారు. తన టీమ్ తో కలిసి నవ్వుతూ దిగిన ఫొటోను షేర్ చేస్తూ… “నాతో పాటు నా యూనిట్ అంతా నవ్వుతూ సరదాగా ఉన్నట్టు నటిస్తున్నాం. నిజానికి మా బాధను మేం దాచడానికి విశ్వప్రయత్నం చేస్తున్నాం. ప్రేమ ప్రేమను ఎంత ప్రేమిస్తుందో.. అంతకంటే ఎక్కువగా మేం మిమ్మల్ని ప్రేమిస్తున్నాం.” అని ట్వీట్ చేశారు. అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న “ఆఫీసర్” మూవీ మే 25న రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus