ఈ గదిలోనే ఉండేవాడిని.. ఇప్పుడు గర్ల్స్ హాస్టల్ అయిపొయింది : వర్మ

Advertisement

తన గదిని పూర్తిగా గర్ల్స్ హాస్టల్ చేసేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు రాంగోపాల్ వర్మ. అయితే అది సీరియస్ గా కాదండి.. సరదాగానే ఇలా చెప్పుకొచ్చాడు. వివరాల్లోకి వెళితే… ఇటీవల తాను చదువుకున్న విద్యాసంస్థ అయిన సిద్దార్థ ఇంజినీరింగ్ కాలేజీని సందర్శించాడు వర్మ. ఈ కాలేజీలో చదువుకున్నప్పుడు రెండు సంవత్సరాలు ఇదే గదిలో ఉన్నానని… అయితే ఇప్పుడు దీనిని గర్ల్స్‌ హాస్టల్‌గా మార్చేశారు అంటూ చెప్పుకొస్తున్నాడు.

ఇలా రాంగోపాల్ వర్మ తను చదువుకునే రోజులను గుర్తుచేసుకున్నాడు. ‘సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్ వెనుక ఉన్న ఓ గదిలో అద్దెకు ఉండేవాడిని. ఈ గదిలో రెండేళ్ళకు పైబడి అద్దెకు ఉన్నానని, ఇప్పుడు ఈ గదిని ‘ఉమెన్స్ హాస్టల్’ గా మారిపోయింది. ప్రస్తుతం ఈ గదిలో ఉంటున్న అమ్మాయిలతో కలిసి దిగిన ఓ ఫొటోను పోస్ట్ చేశాడు వర్మ. తన వెనుక ఉన్న గోడకే నటి శ్రీదేవి పోస్టర్ ను అతికించే వాడినని వర్మ ఈ పోస్ట్ లో పేర్కొన్నాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus