ఇప్పటికీ ఆ అమ్మాయి ఎవరో తెలియదు, కానీ చాలా సిగ్గేసింది

  • September 17, 2019 / 02:33 PM IST

హీరోయిన్లకు మాత్రమే కాదు హీరోలకు కూడా ఒక్కోసారి పబ్లిక్ గా జరిగే కొన్ని విషయాలు షాక్ కు గురి చేస్తుంటాయి. హీరోయిన్స్ ను పబ్లిక్ ఈవెంట్స్ లో తాకాలని, కుదిరితే నలపాలని ప్రయత్నించే వెధవలు బోలెడు మంది ఉంటారు. అదే తరహాలో హీరోలను ఇబ్బందికి గురి చేసే అమ్మాయిలు కూడా ఉంటారు. అలాంటి ఒక ఇబ్బందికర సంఘటనను వరుణ్ తేజ్ ఫేస్ చేయాల్సి వచ్చిందట. వివరాల్లోకి వెళ్తే.. ఒకానొక సందర్భంలో వరుణ్ తేజ్ తన స్నేహితులతో బయటకి వెళ్ళగా.. ఎవరో ఒక అమ్మాయి వెనుక నుంచి వచ్చి వరుణ్ ను గట్టిగా హగ్ చేసుకొందట. ఎవరా అని వెనక్కి తిరిగిన వరుణ్ బుగ్గ మీద మాంచి ముద్దు పెట్టి వెళ్లిపోయిందట. అసలే ఆ అమ్మాయి ఎవరో తెలియదు.. పైగా పబ్లిక్ ప్లేస్ లో ఒక అమ్మాయి అలా ముద్దు పెట్టి వెళ్లిపోవడం చాలా ఇబ్బంది కలిగించిందట వరుణ్ తేజ్ కి.

ఇకపోతే.. వరుణ్ తేజ్ లుక్స్ “వాల్మీకి” సినిమాలో అంత బాగా రావడానికి కారణం నాగబాబు అని హరీష్ శంకర్ చెబుతున్నాడు. వరుణ్ సినిమాల్లోకి రాకముందు ఫోటోలను నాగబాబు అప్పుడప్పుడు హరీష్ కి పంపేవాడట. అందుకే.. వాల్మీకి సినిమా మొదలెట్టాక వరుణ్ ను ఆ పాత లుక్ లో చూడాలి అని టెస్ట్ చేయగా భలే సెట్ అయ్యిందట. మరో రెండు రోజుల్లో విడుదలవ్వనున్న ఈ చిత్రంపై అందరికీ మంచి అంచనాలున్నాయి.

గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
పహిల్వాన్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus