సంకల్ప్ రెడ్డి తో సినిమా చేయనున్న వరుణ్ తేజ్!

  • December 15, 2017 / 01:03 PM IST

వైవిధ్యం.. ఇదే విజయ మంత్రం. అందరూ వెళ్లే దారిలో కాకుండా విభిన్నంగా ఆలోచించారు సంకల్ప్ రెడ్డి. యుద్ధ నేపథ్యంలో ఘాజీ సినిమాని తెరకెక్కించారు. దగ్గుబాటి రానా నటించిన ఈ సినిమాతో సంకల్ప్ రెడ్డి టాక్ ఆఫ్ టాలీవుడ్ అయ్యారు. ఇప్పుడు కూడా కొత్త కథతో మెగా ఛాన్స్ అందుకున్నారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ని డైరక్ట్ చేసే అవకాశం దక్కించున్నారు. ఫిదా మూవీ ఇచ్చిన జోష్ తో వరుణ్ మరో ప్రేమ కథను చేస్తున్నారు. కొత్త దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమా వచ్చే నెలలో పూర్తి కానుంది.

రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరిలో థియేటర్లోకి రానుంది. పవన్ కళ్యాణ్ సిల్వర్ జూబ్లీ సినిమా పేరుతో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన వెంటనే మరో మూవీని పట్టాలెక్కించడానికి వరుణ్ తేజ్ రెడీ అయ్యారు. సంకల్ప్ రెడ్డి చెప్పిన సైన్స్ ఫిక్షన్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయని తెలిసింది. ఈ చిత్రంతో సంకల్ప్ రెడ్డి మరో భారీ విజయాన్ని అందుకోవడానికి శ్రమిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus