చేయను అంటూనే రీమేక్ కన్ఫర్మ్ చేసిన హరీష్ శంకర్

  • January 27, 2019 / 08:43 AM IST

ఒక నెలక్రితం వరకూ “నేను జిగర్తాండ సినిమా రీమేక్ చేయడం లేదు, అవన్నీ గాసిప్స్ మాత్రమే” అని తెగ స్టేట్మెంట్స్ ఇచ్చిన హరీష్ శంకర్ మొత్తానికి ఆ రీమేక్ సినిమాను ఇవాళ అఫీషియల్ గా మొదలెట్టాడు. వరుణ్ తేజ్ కీలకపాత్రలో నటించనున్న ఈ చిత్ర ప్రారంభోత్సవం నేడు ఘనంగా జరిగింది. తమిళంలో బాబీ సింహా పోషించిన పాత్రను వరుణ్ తేజ్ పోషించనున్నాడని.. సిద్ధార్థ్ పాత్రలో శ్రీవిష్ణు కనిపించనున్నాడని టాక్. అయితే.. తెలుగు నేపధ్యానికి తగ్గట్లుగా కథ, కథనంలో హరీష్ శంకర్ మార్క్ మార్పులు చాలా జరిగాయట.

కథానాయకుడిగా మొట్టమొదటి 100 కోట్ల సినిమాతోపాటు, ఓవర్సీస్ లో 2 మిలియన్ డాలర్ క్లబ్ లో కూడా స్థానం సంపాదించుకున్న వరుణ్ తేజ్ ఇప్పుడు సడన్ గా నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ ప్లే చేయనుండడం అనేది సాధారణంగానే చర్చనీయాంశం అయ్యింది. మరి హరీష్ ఈ ప్రొజెక్ట్ ను ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి. ఇకపోతే.. ఈ ప్రొజెక్ట్ కు “వాల్మీకీ” అనే టైటిల్ పెట్టడం మాత్రం అందర్నీ విశేషంగా ఆకట్టుకుంటుంది. వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవ్వనున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో కథానాయిక ఎవరనేది త్వరలోనే ప్రకటించనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus