సూపర్ స్టార్ మహేష్ బాబు ఏదైనా కథను వద్దన్నారంటే అది తప్పకుండా ఘన విజయం సాధిస్తుందనే సెంటిమెంట్ టాలీవుడ్ లో నెలకొనివుంది. రీసెంట్ గా ఆయన చేయలేనన్న రెండు సూపర్ హిట్ కొట్టాయి. అందులో ఒకటి “24” మూవీ. విక్రమ్ కుమార్ ఈ కథను మొదట ప్రిన్స్ కే చెప్పారు. ఈ స్టోరీ బాగా నచ్చినా, ఇందులో సూర్య అయితే ఇంకా బాగుంటుందని సూపర్ స్టార్ చెప్పడంతో, అది సూర్యతో నిర్మితమై బ్లాక్ బస్టర్ అయింది. రెండో స్టోరీ అ..ఆ. ఈ సినిమా కథను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మొదట మహేష్ కి వినిపించారు. ఈ కథ కూడా ఆయనకు సూపర్ గా నచ్చింది. అయినా తండ్రి కృష్ణ “మీనా” సినిమాను రీమేక్ చేయడం ఇష్టం లేక పక్కన పెట్టారు. ఆ చిత్రం కూడా సూపర్ హిట్ అయింది.
దీంతో మహేష్ కాదన్న కథ తో సినిమా తీస్తే హిట్ పక్క అని ఇండస్ట్రీ జనాలు నమ్ముతున్నారు. ఇప్పుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫిదా మూవీ కూడా గ్యారంటీగా విజయం సాదిస్తుందని చెబుతున్నారు. ఎందుకంటే ఈ కథను కూల్ డైరక్టర్ మొదట ప్రిన్స్ కి చెప్పారంట. ఆయనకు నచ్చడంతో చాలా కాలం తన దగ్గర ఉంచుకున్నారంట. కొన్ని కమిట్ మెంట్స్ వల్ల ఈ చిత్రాన్ని చేయలేకపోయారు. అదే స్క్రిప్ట్ తో ఇప్పుడు వరుణ్ తేజ్ ఫిదా చేస్తున్నారు. సో ఈ చిత్రం హిట్ అని అందరూ డిసైడ్ అయిపోయారు.