బయటికి వచ్చిన తేజ సినిమాలో వెంకటేష్ లుక్..!

  • March 9, 2018 / 07:22 AM IST

విక్టరీ వెంకటేష్ (Venkatesh) ఏ పాత్ర చేసినా అందులో ఒదిగిపోవడానికి ప్రయత్నిస్తారు. పాతికేళ్ల క్రితం కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన “సుందరకాండ” సినిమాలో జూనియర్‌ కాలేజ్‌ లెక్చరర్‌గా వెంకీ కనిపించారు. మళ్లీ ఇప్పుడు కాలేజీలో పాఠాలు చెప్పడానికి సిద్ధమయ్యారు. బాక్సింగ్ కోచ్ గా గురు సినిమాలో అదరగొట్టిన వెంకీ మరోమారు గురువు పాత్రనే ఎంచుకున్నారు. తేజ దర్శకత్వంలో చేయనున్న సినిమాలో కాలేజ్‌ ప్రొఫెసర్ గా నటిస్తున్నారు. ఈ పాత్రకు సంబంధించిన లుక్ ఒకటి ఈరోజు రిలీజ్ అయింది. వెంకీ ప్రొఫెసర్‌ లుక్ అదిరిపోయింది. ఒక చేతికి బ్యాగ్ తగిలించుకుని.

మరో చేతిలో బుక్‌తో.. నీట్‌ డ్రెస్సింగ్‌తో కనిపిస్తున్నారు. గురలో వెంకీ ఇన్‌స్పైరింగ్ కోచ్‌గా కనిపించారు. ఈ సినిమాలో ఇన్‌స్పైరింగ్ ప్రొఫెసర్‌గా ఆకట్టుకోనున్నట్లు ఈ చిత్రం చెప్పకనే చెప్పింది. సురేశ్‌ ప్రొడక్షన్స్, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కనుంది. ఇందులో వెంకీ సరసన శ్రియ నటించనుంది. ఈ జోడీ గతంలో “సుభాష్‌ చంద్రబోస్‌”, గోపాల గోపాల సినిమాల్లో కనిపించింది. ఇప్పుడు మూడోసారి కనువిందు చేయనుంది. ‘ఆటా నాదే – వేటా నాదే’ అనే పేరు పరిశీలిస్తున్న ఈ చిత్రంలో నారా రోహిత్‌ ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus