కిషోర్ తిరుమల ద‌ర్శ‌క‌త్వంలో విక్ట‌రి వెంక‌టేష్.

2016 లో మెట్ట‌మెద‌టి సూప‌ర్‌డూప‌ర్ హిట్ చిత్రం నేను శైల‌జ ని  అందించిన ద‌ర్శ‌కుడు కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో విక్ట‌రి వెంక‌టేష్ హీరోగా, మ‌ల్టిడైమ‌న్ష‌న్ రామ్ మెహ‌న్ గారు ప్రోడ్యూస‌ర్ గా  చిత్రాన్నినిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం విక్ట‌రి వెంక‌టేష్ హీరోగా మారుతి ద‌ర్శ‌క‌త్వం లో చేస్తున్న చిత్రం త‌రువాత  ఈ సినిమా సెట్స్ మీద‌కి వెళ్ళ‌నుంది.
ఈ సంద‌ర్బంగా ద‌ర్శ‌కుడు కిషోర్ తిరుమ‌ల మాట్లాడుతూ” నేను శైల‌జ లాంటి సూప‌ర్‌డూప‌ర్ హిట్ చిత్రం త‌రువాత విక్ట‌రి వెంక‌టేష్ గారితో నా త‌దుప‌రి చిత్రం వుంటుంది. వెంక‌టేష్ గారికి క‌థ చెప్ప‌టం జ‌రిగింది. వెంక‌టేష్ గారికి క‌థ న‌చ్చ‌టంతో ప్ర‌స్తుతం స్క్రిప్ట్ వర్క్ లో వున్నాను. నా త‌దుప‌రి చిత్రం వెంక‌టేష్ గారితో చేస్తున్నందుకు ఆనందంగా వుంది. అలాగే ఇంత క్రేజి చిత్రాన్ని మ‌ల్టిడైమ‌న్ష‌న్ రామ్‌మెహ‌న్ గారు నిర్మిస్తున్నారు. నెను చెప్పిన క‌థ అంద‌రికి న‌చ్చ‌టంతో మిగ‌తా కాస్టింగ్ ప‌నుల్లో బిజిగా వున్నాను. ప్ర‌స్తుతం మారుతి ద‌ర్శ‌క‌త్వంలో వెంక‌టేష్ గారు చేస్తున్న చిత్రం త‌రువాత మా చిత్రం సెట్స్ మీద‌కి వెలుతుంది. వెంక‌టేష్ గారి అభిమానుల‌కి ఏలాంటి అంశాలుంటే ఎంజాయ్ చేస్తారో, అలాగే ఫ్యామిలి ఆడియ‌న్స్ ఆయ‌న నుండి ఏం కోరుకుంటారో అన్ని క‌మ‌ర్షియ‌ల్ అంశాలుంటూనే చ‌క్క‌టి వినోదం వుంటుంది.  ఈ చిత్రం లో చాలా ఇంట్ర‌స్టిగ్ సెగ్మెట్స్ వుంటాయి. ఆ వివ‌రాలు అతి త్వ‌ర‌లో మీకు తెలియ‌జేస్తాము..” అన్నారు
Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus