‘నేనే రాజు నేనే మంత్రి’ సక్సెస్ తో దర్శకుడిగా తన పూర్వ వైభవాన్ని తిరిగి సంపాదించుకొన్న తేజ.. తన తదుపరి చిత్రంగా బాలకృష్ణతో ‘ఎన్టీయార్’ బయోపిక్ ను వెంకటేష్ తో మరో చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేసుకొంటున్న విషయం తెలిసిందే. వెంకటేష్ పుట్టినరోజును పురస్కరించుకొని డిసెంబర్ 13న ప్రారంభోత్సవం జరుగుపుకోనున్న ఈ చిత్రంలో కాజల్ కథానాయికగా నటించనుందని విశ్వసనీయవర్గాల సమాచారం.
అయితే.. ఈ చిత్రానికి టైటిల్ కూడా ఫైనల్ చేసేశాడట తేజ. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల తరహాలో కాకుండా టిపికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో వెంకటేష్ ప్రొఫెసర్ గా కనిపించనున్నాడని వినికిడి. ఈ సినిమాతోపాటు వెంకీ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మొదలవ్వాబోయే చిత్రంలో సైమల్టేనియస్ గా నటించనున్నాడని టాక్ వినిపిస్తున్నా.. ఇప్పటివరకూ వెంకీ ఎప్పుడు రెండు సినిమాల్లో ఒకేసారి నటించలేదు. మరి తేజ & అనిల్ కోసం ఆ పద్ధతిని మార్చుకోంటాడేమో చూడాలి.