కామెడీ డైరెక్టర్ తో సినిమా సైన్ చేసిన వెంకటేష్

  • May 25, 2019 / 04:36 PM IST

తన తోటి కథానాయకులైనా నాగార్జున, బాలకృష్ణలను చూసి తాను కూడా స్పీడ్ పెంచడం ముఖ్యం అనుకున్నాడో ఏమో కానీ.. వెంకటేష్ ఈమధ్య సినిమాకి సినిమాకి మధ్య గ్యాప్ ను బాగా తగ్గించాడు. ఆల్రెడీ వెంకటేష్ తన మేనల్లుడు నాగచైతన్యతో కలిసి “వెంకీ మామా” సినిమాలో నటిస్తున్న వెంకటేష్ ఆ సినిమా పూర్తవ్వకుండానే మరో ప్రొజెక్ట్ ఒకే చేశాడు. ఒక నటుడిగా తన బలం ఏమిటో, బలహీనత ఏమిటనేది పూర్తిస్థాయిలో తెలిసిన విక్టరీ వెంకటేష్ తన తదుపరి సినిమా కోసం కూడా ఒక కామెడీ కథాంశాన్ని ఎంచుకొన్నాడని తెలుస్తోంది.

“సినిమా చూపిస్త మావ, నేను లోకల్, హలో గురు ప్రేమ కోసమే” చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్, సూపర్ హిట్, మోడరేట్ హిట్ అందుకున్న దర్శకుడు త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో వెంకటేష్ తదుపరి చిత్రం ఉండబోతోందట. నిర్మాతలెవరు అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు కానీ.. ప్రొజెక్ట్ మాత్రం పక్కా అని తెలుస్తోంది. త్వరలోనే అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వెలువడనుందట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus