యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల తన మొదటి చిత్రం హీరో నాగ శౌర్య వివాదం గురించిన మరోమారు స్పందించారు. నాగ శౌర్య మాటలలో నిజం లేదని హింట్ ఇచ్చారు. రేపు ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన భీష్మ విడుదల నేపథ్యంలో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. నాగ శౌర్య గారి అమ్మ గారు గిఫ్ట్ గా ఇచ్చిన కార్ ని మీరు అమ్ముకున్నారట కదా? అని అడుగగా. ఆయన స్పందిస్తూ నా మొదటి సినిమా ద్వారా వచ్చిన గిఫ్ట్ అది. అది నాకెంతో విలువైనది దానిని నేను ఎలా అమ్ముకుంటాను. ఆ ఆరోపణలలో నిజం లేదని ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఈ వివాదాలు, పర్సనల్ విషయాల పై జనాలకు ఆసక్తి లేదు. అందుకే దీనికి గురించి వదిలేద్దాం అని ఆయన ఆ చర్చకు ఫుల్ స్టాప్ పెట్టారు.
వెంకీ కుడుముల తన మొదటి చిత్రంగా నాగ శౌర్య హీరోగా ఛలో తీశారు. నాగ శౌర్య సొంత నిర్మాణ సంస్థ ఐరా క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ఐతే ఈ చిత్ర కథ విషయంలో హీరో నాగ శౌర్య మరియు దర్శకుడు వెంకీ కుడుములకు మధ్య వివాదం తలెత్తింది. ఇటీవల విడుదలైన అశ్వథామ చిత్రానికి నాగ శౌర్య కథను అందించారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఛలో సినిమా కథ కూడా నాదేనని, దర్శకుడు వెంకీ క్రెడిట్ నాకు ఇవ్వలేదంటూ ఆయనపై విమర్శలు గుప్పించారు. ఇక దర్శకుడు వెంకీ మాత్రం వాస్తవాలేమైనా ఈ వివాదాన్ని ఇంతటి ముగించేస్తే బెటర్ అని భావిస్తున్నాడు.
Most Recommended Video
వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా రివ్యూ & రేటింగ్!
పవన్ కళ్యాణ్ రీమేక్ చేసిన 11 సినిమాల
ఒక చిన్న విరామం సినిమా రివ్యూ & రేటింగ్!