ఆ బాబు రాగానే ఈ బాబు భయపడుతున్నాడా

  • June 4, 2018 / 01:15 PM IST

ఒక హీరో డౌన్ అవుతున్నాడు అనగానే మరో హీరోకి ఆటోమేటిక్ గా లైఫ్ వచ్చేస్తుంది. అలా సునీల్ కమెడియన్ గా సినిమాలు మానేసి హీరోగా కెరీర్ ను ప్లాన్ చేసుకొంటున్న తరుణంలో ఎదిగిన కామెడియన్స్ వెన్నెల కిషోర్, సప్తగిరి, షకలక శంకర్. ప్రస్తుతం సప్తగిరి, షకలక శంకర్ లు హీరోలుగా తమ కెరీర్ లను చక్కదిద్దుకోవడంలో బిజీ అయిపోవడంతో ఆ ఆఫర్లన్నీ సొంతం చేసుకుంటూ వెన్నెల కిషోర్ మోస్ట్ వాంటెడ్ కమెడియన్ అయిపోయాడు.

కట్ చేస్తే.. సునీల్ మళ్ళీ కమెడియన్ గా బిజీ అవుతుండడంతో ఆ ఎఫెక్ట్ వెన్నెల కిషోర్ కి కొడుతోంది. సునీల్ తన ఆఫర్లన్నీ వెనక్కి తెచ్చుకుంటుంటే.. వెన్నెల కిషోర్ ఆఫర్ల కోసం వెయిట్ చేయాల్సి వస్తోంది. ఒక రెండుమూడు నెలల క్రితం సైన్ చేసిన సినిమాలు మినహా చేతిలో పెద్ద ప్రొజెక్ట్స్ లేకపోవడంతో కంగారుపడుతున్నాడు కిషోర్ బాబు. మరోపక్క సునీల్ మాత్రం వరుసగా సినిమాలు సైన్ చేస్తూ.. స్టార్ కమెడియన్ గా తన పూర్వ వైభవాన్ని సంపాదించుకొనే పనిలో పడి యమ బిజీగా ఉన్నాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus