అభిమానుల సమక్షంలో పుట్టినరోజు జరుపుకోనున్న ప్రభాస్!

  • October 20, 2017 / 12:07 PM IST

సాహో సినిమా షూటింగ్ పనుల్లో ప్రభాస్ బిజీగా ఉండగా.. అభిమానులు మాత్రం ప్రభాస్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్ పుట్టినరోజు(అక్టోబర్ 23 )కి రెండు రోజులు మాత్రమే ఉంది. తన బర్త్ డే వేడుకను అభిమానుల మధ్యలో జరుపుకోవాలని ప్రభాస్ ఫిక్స్ అయినట్లు తెలిసింది. అందుకే  గోపీచంద్ నటించిన ‘ఆక్సిజన్’ సినిమా ఆడియో రిలీజ్ వేడుకకు రానున్నారు. ఈ వేదికపై కేక్ కట్ చేయనున్నట్లు సమాచారం.

జోతికృష్ణ దర్శకత్వం వహించిన ఆక్సిజన్ సినిమా నవంబర్ 27 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. గోపీచంద్, రాశిఖన్నా, అను ఇమ్యానుల్ నటించిన ఈ చిత్రానికి ప్రచారం చేసినట్లు ఉంటుంది.. అభిమానులను కలిసినట్లు ఉంటుందని ఉద్దేశంతో ప్రభాస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫిల్మ్ నగర్ వాసులు చెబుతున్నారు. ఈ విషయాన్నీ రేపు అధికారికంగా ప్రకటించనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus