సినిమాల విషయంలో తన రూటు మార్చిన రవితేజ

  • November 15, 2018 / 11:23 AM IST

హీరో రవితేజ ఒకప్పుడు సంవత్సరానికి మూడు, నాలుగు సినిమాలు రిలీజ్ చేస్తూ మినిమమ్ గ్యారెంటీ హిట్ కొడుతూ మంచి సక్సెస్ ని చూసాడు. గత కొంతకాలం నుండి రవితేజకి సరైన సక్సెస్ అనేదే లేదు. అయితే తనకి కలసి వచ్చే మాస్, కామెడీ జానర్ లో ఉండే సినిమాలను కాస్త పక్కన పెట్టి తన రూటు మార్చుకొని వి.ఐ. ఆనంద్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ సినిమా చేసేందుకు ఒకే చేసాడట. ఇదివరకు అన్ని మాస్, కామెడీ ఉన్న సినిమాలే లైన్ గా చేస్తూ వచ్చిన రవితేజకి వరుస అపజయాలు రావడంతో తన రూట్ ని కాస్త మార్చుకునట్లుగా తెలుస్తుంది.

అయితే హీరో రవితేజ ఇటీవలే ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ, నాకు హాలీవుడ్ ‘టేకెన్’ లాంటి యాక్షన్ సినిమాలు చేయడం అంటే చాలా ఇష్టమని అలాంటి కథతో నా దగ్గరికి ఎవరైనా వస్తారా అని ఎదురుచూస్తున్నాని చెప్పాడు. ఇంకా ప్రస్తుతం యంగ్ డైరెక్టర్లు తీస్తున్న వెబ్ సిరీస్ లు కూడా చూస్తున్నానని, నాకూడా వెబ్ సిరీస్ లో నటించాలని ఉందంటూ చెప్పాడు. ఇక కొత్త తరహాలో వెళ్దాం అనుకుంటున్నా రవితేజ కి తనకి ఇష్టమైన యాక్షన్ తరహా కథలు ఆయన్ని వెతుకుంటూ వస్తాయో లేదో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus